నానాటికి దేశంలో ఆడవాళ్ళకు రక్షణ కరువవుతుంది. మహిళలపైనదాడులు, అఘాయిత్యాలు చేసేవాళ్ళు ఒకొక్కరు ఒక్కొక్క కొత్తదారులు అనుసరిస్తున్నారు. కొంతమంది భౌతిక దాడులకు పాల్పడుతూ తమ కోరికలను తీర్చుకుంటుంటే మరి కొంతమంది ఇంటర్నెట్ ఉపయోగించి వారిని వేధింపులకు గురిచేయడం మనం తరచూ టీవీల్లో, దినపత్రికలలో చూస్తునే ఉన్నాం.


కాగా ఇప్పుడు జరిగిన ఒక సంఘటనను చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ప్రబుద్ధుడు చదివింది మాత్రం ఐదవ తరగతి మాత్రమే కానీ ఫేసుబుక్ వాడటంలో పీజీ చేశాడు. వివరాల్లోకెళితే అనంతపురం జిల్లా బుక్కరాయపట్నంకు చెందిన రంగస్వామి చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్‌ కు వచ్చి స్థిరపడ్డాడు. డబ్బు సులభంగా సంపాదించాలన్న కోరికతో మొదట్లో చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడేవాడు. చిన్న చిన్న వాటితో డబ్బు సరిపోకపోవడంతో ఫేసుబుక్ ను నమ్ముకున్నాడు. పెళ్లికాని యువతులను టార్గెట్ చేసుకుని వారిని ప్రేమ, పెళ్లి అంటూ నమ్మించిన తరువాత శారీరకంగా అనుభవించి, వాళ్ళ డబ్బులు తీసుకుని అక్కడనుండి పరారయ్యేవాడు.


వీడు ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 20 మంది అమ్మాయిలను అనుభవించి వాళ్ళ దగ్గర లక్షల్లో డబ్బులు కాజేసి ఉడాయించేవాడు. వీరి బారీన పడి మోసపోయిన వాళ్లలో ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలలో పనిచేస్తున్న ఆడవారు కూడా ఉన్నారు. వీరెవ్వరు తమ పరువు ఎక్కడపోతుందో అని ఈ విషయాలను గోప్యంగా ఉంచారు. కానీ లాలాగూడకు చెందిన ఒక యువతి  రంగస్వామి తనను పెళ్లిచేసుకుంటానని, పలుమార్లు శారీరకంగా కూడా వాడుకుని నమ్మించి లక్షల్లో డబ్బులు తీసుకుని పరారయ్యాడని పోలీసులుకు ఫిర్యాదు చేసింది. తనపై పలుమార్లు అత్యాచారం కూడా చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. కాగా ప్రస్తుతం పోలీసులు అతణ్ణి అరెస్టు చేసి విచారిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: