జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో జరుగుతుంది. తను చేప‌ట్టిన ప్ర‌జాసంక‌ల్ప యాత్ర 93వ రోజుకు చేరుకుంది.ఇవాళ ఉద‌యం కందుకూరు నుంచి ప్రారంభ‌మైన ఈ యాత్ర వెంక‌టాద్రిపాలెం, అనంతసాగరం మీదుగా జరుగుమల్లి మండలం ఎడ్లూరుపాడు వద్ద కొండపి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కొండపి నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు భారీ జనసందోహం మధ్య వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికారు.
Image result for jagan
మధ్యాహ్న సమయానికి యాత్ర వెంకన్నపాలేనికి చేరుకుంది. ఇవాళ‌ సాయంత్రానికి విప్పగుంటకు చేరుకోనుంది. అయితే,అడుగ‌డుగునా జ‌గ‌న్ కు ప్ర‌జ‌లు నీరాజ‌న‌లు ప‌డుతూ ఘ‌న‌స్వాగ‌తం ప‌లుకుతున్నారు.మ‌హిళ‌లు సైతం పెద్దెత్తున త‌ర‌లివ‌చ్చి జ‌గ‌న్ కు సంఘీబావం తెలుపుతున్నారు.సీఎం కావాలంటూ నినాదాలు చేస్తున్నారు.ఇక వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకుంటూ, త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తే తాను అన్నీ ప‌రిష్క‌రిస్తానంటూ హామీ ఇస్తున్నాడు.
Image result for jagan
అయితే,ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తివ్వాలంటూ ఎమ్మార్పీఎస్ కార్య‌క‌ర్త‌లు జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను అడ్డుకున్నారు.ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తుపై జ‌గ‌న్ త‌మ పార్టీ వైఖ‌రేంటో చెప్పాల‌ని ఆందోళ‌న చేశారు.దీంతో తాను వ‌ర్గీక‌రణ‌కు మ‌ద్ద‌తివ్వ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశాడు జ‌గ‌న్.ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ అంశం రాష్ట్ర ప‌రిధిలో లేద‌ని,దాన్ని కేంద్రం తేల్చాల్సి ఉంద‌ని తెలిపాడు. త‌మ పార్టీ మాత్రం వ‌ర్గీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తివ్వ‌టం లేద‌ని క‌రాఖండీగా చెప్పేశాడు జ‌గ‌న్. 


మరింత సమాచారం తెలుసుకోండి: