వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థి విజయసాయిరెడ్డి మిద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పోలీసు శాఖ ఆగ్రహం చెందింది. దీనికి గల కారణం ఏమిటంటే ఇటీవల విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీస్ శాఖల్లో ఉన్న కొందరు వ్యక్తులు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ తోత్తులు గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.


ఈ సందర్భంగా కొంతమంది పోలీసు శాఖలో ఉన్న పేర్లను ప్రస్తావిస్తూ అధికారంలోకి వచ్చాక వదలిపెట్టమని హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో వైయస్సార్ సిపి రాజ్యసభ అభ్యర్థి విజయసాయిరెడ్డి ప్రకటించిన పోలీస్ ఆఫీసర్ పేరులలో ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు పై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పై ఆత్మ విమర్శచేసుకోవాలని తెలిపింది పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్.


ఎంతో నిబద్దత గల ఆఫీసర్ మీద విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని అన్నారు…మేము ఎవరికీ కూడా వ్యక్తిగతంగా పని చేయమని..మాకు నీతి నిజాయితి ఉన్నాయని ఆ వ్యాఖ్యలు విజయసాయి రెడ్డి వెనక్కు తీసుకోవాలని, లేకపోతే తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించింది.


అంతేకాదు అలాగే సిఎంఒ ఇన్‌ఛార్జి సతీశ్‌చంద్ర మీద చేసిన వ్యాఖ్యల పై కూడా కొంత మంది ఐఏఎస్ లు అభ్యంతరం చెప్పారు. ఇలానే వ్యవహరిస్తే కచ్చితంగా అరెస్టు చేస్తామని విజయసాయిరెడ్డిని హెచ్చరించారు పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ మెంబెర్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: