తెలంగాణ ప్రొఫెసర్ టి జాక్ ప్రధాన సభ్యుడు అయినా ప్రొఫెసర్ కోదండరామ్ రేపోమాపో తెలంగాణా రాజకీయాలలో అడుగుపెడతారని వార్తలు వినబడుతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి చెమటలు పడుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కెసిఆర్ కి అండగా ఉద్యమాన్ని ముందుకు తిసుకేల్లిన ప్రధాన సభ్యులలో ఒకరు ప్రొఫెసర్ కోదండరామ్. అయితే తర్వాత అనేక రాజకీయ పరిణామాలు వల్ల కెసిఆర్ ప్రొఫెసర్ కోదండరామ్ ని  పక్కన పెట్టేసి తెలంగాణ అధికార పీఠం ఎక్కారు.


అయితే తాజాగా కోదండరామ్ రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టి తరుపున కానీ సొంత పార్టి తరుపున కానీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కోదండరాం సొంత జిల్లా మంచిర్యాల. ఆయన అక్కడి నుంచే పోటీ చేస్తారనే ప్రచారం చాన్నాళ్లుగా ఉంది. ఆయన తరుచూ మంచిర్యాల జిల్లాలో పర్యటించడం కూడా ఇందుకు కారణం. దీంతో కోదండరామ్ ను  ఢీకొట్టే యోధుని కోసం అధికార పార్టీ అన్వేషణ మొదలు పెట్టిందని సమాచారం. కోదండరామ్ కు  మంచిర్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే దివాకర్ రావు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలు లేవని టీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది.


అందుకే ప్రొఫెసర్ కి పోయిగా ఎవరైతే బావుంటుంది అన్న చర్చ టిఆర్ఎస్ లో జోరుగా సాగుతోంది. మంచిర్యాల సిట్టింగ్ ఎమ్యెల్యే దివాకర్ రావు పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండడం ప్రజలను పట్టించుకోకపోవడం అక్రమంగా ఆస్తులను సంపాదించుకోవడం భయంకరంగా ఉండేది చేయడంతో ఎమ్మెల్యే దివాకర్ రావు మీద ప్రజలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది.


దీంతో గులాబీ బాస్ కోదండరామ్ ని ఎలాగైనా ఓడించాలని సరైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారాట...అయితే ఈ క్రమంలో గతంలో మూడుసార్లు మంచిర్యాల నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి వైపు కెసిఆర్ మొగ్గుచూపుతున్నారని సమాచారం. వచ్చే ఎన్నికలలో తెరాస పార్టి గెలిచిన కోదండరామ్ పోటి చేసి గెలిస్తే మాత్రం తెలంగాణా ప్రజలలో తీవ్ర వ్యతిరేకత తీసుకొస్తాడని కేసీఆర్ ముందే  ఉహిస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: