రాజకీయాల్లో ఒక పార్టీ గుర్తు మీద గెలిచి, మరో పార్టీ లోకి జంప్ అవ్వడం మన రాజకీయ నాయకులుకు వెన్నతో పెట్టిన విద్య. పైగా తాము చేసింది కరెక్టే అని కవర్ చేసుకొనే పనికిమాలిన రాజికియ నాయకులుకు మన రాష్ట్రం లో కాదు, కాదు మన దేశంలో సర్వ సాధారణం. వైకాపా తరఫున తను 50వేలకుపై స్థాయి మెజారిటీతో, ఇంకా చెప్పాలంటే చంద్రబాబు కుప్పంలో సాధించిన మెజారిటీ కన్నా తన నియోజకవర్గంలో తను ఎక్కువ మెజారిటీతో గెలిస్తే.. ఫిరాయించి పరువుపోగొట్టుకున్నా అని ఆ ఎమ్మెల్యే తెగ బాధపడ్డాడు.
Image result for mla manigandhi
తను అమ్ముడుపోయాను.. అని ఆయనే చెప్పుకోవడం విశేషం. ఆయన పరిస్థితి మాత్రమే కాదట.. తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన చాలా మంది వైకాపా ఎమ్మెల్యేల పరిస్థితి అలానే ఉందట. ఈ విషయాన్ని కూడా సదరు ఎమ్మెల్యేనే వివరించి చెప్పాడు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీ ఈ విధంగా వ్యాఖ్యానించడం.. ఆసక్తిదాయకంగా మారింది. ఫిరాయింపుదార్లలో మొదలైన కలవరానికి నిదర్శనంగా మారింది ఈ వ్యవహారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి.. తెలుగుదేశంలోకి చేరిపోయిన చాలా మంది ఎమ్మెల్యేలు చాలా డక్కామొక్కీలే తింటున్నారు.
Image result for mla manigandhi
ఫిరాయింపులు చేసి నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా.. చాలా మంది ఇంకా దేశంలో కుదురుకోలేకపోతున్నారు. పార్టీలోని పాతకాపులకు, వీళ్లకు మధ్యన విబేధాలు తలెతుత్తూ ఉన్నాయి. దీనికి తోడు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. టికెట్ విషయంలో వీళ్ల పరిస్థితి దయనీయాంగా మారింది. ఫిరాయింపుదార్లందరికీ చంద్రబాబు చెప్పింది ఒకే మాట.. సీట్లు పెరుగతాయి, మీకు టికెట్ ఇస్తా.. అని బాబు చెప్పాడు. ఫిరాయింపుల నేపథ్యంలో అలిగిన తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జిలకు కూడా అదే మాటే చెప్పారు బాబు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని వారందరికీ అభయం ఇచ్చాడు. కట్ చేస్తే.. ఇప్పుడు పునర్విభజన ఇక కలలో మాటగా అగుపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: