చిరంజీవి ఒక మెగా స్టార్. తెలుగు ప్రేక్షకలు అతన్ని ఎంతగానో ఆరాధిస్తారు. అయితే 2009 లో ప్రజా రాజ్యం పార్టీ పెట్టి,  ఓటమి పాలై కాంగ్రెస్ లో కలిపేసిన సంగతి తెలిసిందే. అయితే అతను ఇప్పటికి ఎంపి గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక హోదా గురించి ఇంతగా రభస జరుగుతుంటే, చిరంజీవి కనీసం స్పందించలేదు. 
Image result for chiranjivi
తమ్ముడి కొడుకు సినిమా హిట్టైందని.. దానికి మరింత పబ్లిసిటీ ఇవ్వడానికి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి మాత్రం చాలా తీరిక ఉంటుంది. తన సినిమాటిక్ పొగడ్తలో ప్రెస్ మీట్లో కూడా తెగ యాక్ట్ చేసేస్తూ, అబ్బురాన్ని చూసినట్టుగా చెప్పడానికి అయితే సమయం ఉంటుంది. మీ కుటుంబం, మీ హీరోలు, మీ సినిమాలు.. వీటి కోసం సమయం కేటాయించడంలో ఎలాంటి తప్పు లేదు. అది చిరంజీవి బాధ్యత అయితే అయి ఉండవచ్చు.
Image result for chiranjivi
కానీ చిరంజీవికి అంతకు మించిన బాధ్యత లేదా? ఎంపీగా అయితే కొనసాగుతున్నారు కదా? ఏపీ కోటాలో రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు కదా? ఆ బాధ్యతతో ఒక్కసారి అయినా ఈ మెగాస్టార్ స్పందించాడా? అవతల నాలుగు సంవత్సరాలనుంచి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తూనే ఉంది, ఈ సారి బడ్జెట్లో కూడా అదే అన్యాయమే జరిగింది. ప్రత్యేకహోదా పోయింది, ప్రత్యేక ప్యాకేజీ ఊసు కనిపించడం లేదు.. ఇలాంటి సమయంలో ఏపీ పరిస్థితి మరీ దయానీయంగా మారింది. ఈ అంశం గురించి చాలా మంది స్పందిస్తున్నారు. పక్క రాష్ట్రాల వారు  కూడా స్పందిస్తున్నారు. అయితే చిరంజీవికి మాత్రం స్పందించే తీరిక కనిపించడం లేదు. రాజ్యసభలో నిరసన తెలపలేదు ఆఖరికి కాంగ్రెస్ పార్టీలోని ఎంపీలు నిరసన తెలుపుతున్నా చిరంజీవికి మాత్రం అంత తీరిక కనిపించడం లేదు. ఇది అతని నిజాయితీ, తను ఇంతకు మునుపు పెట్టిన పార్టీ ఉద్దేశం. 


మరింత సమాచారం తెలుసుకోండి: