బీజేపీ టీడీపీ మధ్య వార్ ఓ రేంజ్ లోకి వెళ్లిపోయింది. ఈ దశలో పగిలిన అద్దం అతుకుతుందని భావించలేం. ఇక బీజేపీ టీడీపీ కలిసి ఉంటాయనే నమ్మకం రాజకీయ శ్రేణుల్లో లేదు. ఢిల్లీలో కూడా ఇదే టాక్ వినిపిస్తోంది. మిగిలిన పక్షాల్లా కాకుండా ఎన్డీయేలో నమ్మదగిన మిత్రపక్షంగా ఉన్న టీడీపీ దూరమవడం అటు బీజేపీ శ్రేణులను కూడా కలవరపెడుతోంది. ఇంతకూ టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కటీఫ్ కావడానికి కారణాలేంటి?

Image result for tdp bjp

బీజేపీ టీడీపీలు ఇప్పటికే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారాన్ని పంచుకుంటున్నాయి. కేంద్రంలోని మోదీ సర్కార్ లో టీడీపీ మంత్రులున్నాయి. రాష్ట్రంలోని చంద్రబాబు సర్కార్ లో బీజేపీ మంత్రులున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని భావించిన చంద్రబాబు బీజేపీతో వెళ్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందనుకున్నారు. నాటి సభల్లో కూడా అదే చెప్పారు. మోదీ కూడా తాను పెద్దన్నలాగా ఈ రాష్ట్రానికి అండగా ఉంటానని మాటిచ్చారు. దీంతో టీడీపీ బీజేపీ ఉమ్మడిగా పోటీ చేశాయి. రెండు చోట్లా అధికారంలోకి వచ్చాయి.

Image result for tdp bjp

                మోదీ ఫస్ట్ కేబినెట్ లోనే పోలవరం ముంపు మండలాలను ఆంధ్రాలో కలుపుతూ నిర్ణయం తీసుకోవడంతో ఇక ముందుముందు కూడా ఆంధ్రాకు ఎలాంటి ఇబ్బందలూ ఉండకపోవచ్చని భావించారు. మోదీ రాష్ట్రానికి ఎంతో చేస్తారని ఆశలు పెట్టుకున్నారు. సరిగ్గా ఏడిదిన్నర తర్వాత అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి మోదీ హాజరయ్యారు. వరాల వర్షం కురుస్తుందని రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆశలు పెట్టుకున్నారు. అయితే మోదీ మాత్రం ముంతడు మట్టి – చెంబుడు నీళ్లు మొహాన కొట్టి వెళ్లిపోయారు. అయినా టీడీపీ నేతలు నోరు జారలేదు. కొంతమంది విమర్శలు చేసినా.. సాయం చేయడానికి ఇంకా సమయముందని, మోదీ తప్పకుండా న్యాయం చేస్తారని బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు. చంద్రబాబు కూడా అదే ఆశతో శ్రేణులను సముదాయించారు. పైగా నాడు వెంకయ్యనాయుడు తానున్నానంటూ అన్నీ భుజాన వేసుకున్నారు.

Image result for tdp bjp

                ఆ తర్వాత కూడా రాష్ట్ర విభజన అంశాలపై చంద్రబాబు ఎప్పటికప్పుడు ఢిల్లీ వెళ్లి మంత్రులను, ప్రధానిని కలుస్తూ వచ్చారు. కానీ నో యూజ్. అందరూ వినడమే తప్ప ఏమాత్రం స్వాంతన చేకూర్చలేకపోయారు. మూడేళ్లు గడిచిన తర్వాత కూడా రాష్ట్రానికి పెద్దగా ఒనగూరిన ప్రయోజనం లేదు. మిగిలిన రాష్ట్రాల మాదిరిగానే రోడ్లు మనకూ వచ్చాయి. విభజనచట్టంలోని విద్యాసంస్థలకు పర్మిషన్ ఇచ్చినా నిధులివ్వకపోవడంతో అవి నానా తంటాలు పడుతున్నాయి. అన్నిటికన్నా ముఖ్యమైన పోలవరం, రైల్వే జోన్, స్టీల్ ఫ్యాక్టరీలతో పాటు షెడ్యూల్ 9, 10 లోని సంస్థల విభజనపై కేంద్రం అస్సలు చొరవ చూపట్లేదు. ఇవి పరిష్కారమైతే తెలంగాణ, ఆంధ్రా మధ్య సర్వ సమస్యలకు సమాధానాలు లభిస్తాయి.

Image result for tdp bjp

          వీటన్నిటికీ మించి సీఎం చంద్రబాబు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తులు చేసి వచ్చినా కనీసం పట్టించుకోకపోవడం ఆ పార్టీ శ్రేణులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. మరోవైపు చంద్రబాబు ప్రధాని అపాయింట్ మెంట్ కోరినా ఇవ్వకపోవడం, అదే సమయంలో ప్రతిపక్షనేత జగన్ కు అవకాశమివ్వడంతో టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. మిత్రపక్షమైన టీడీపీ నేతలకు కాకుండా ప్రతిపక్ష వైసీపీకి చెందిన విజయసాయిరెడ్డి పదేపదే పీఎంవోలో కనిపించడం, బీజేపీ నేతలతో రాసుకుపూసుకు తిరగడం టీడీపీ నేతలకు మరింత ఆగ్రహం తెప్పించింది. వీటన్నిటినీ గమనించిన టీడీపీ.. అంతర్గతంగా వైసీపీతో సన్నిహితంగా మెలుగుతోందని గ్రహించింది. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించకముందే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి బీహార్ వెళ్లి రామ్ నాధ్ కోవింద్ ను కలవడాన్ని చంద్రబాబు ఈ మధ్య ప్రస్తావించారు. అంతేకాక పీఎంవోలో నిత్యం ఆయన తిరుగుతుండడాన్ని కూడా టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది.

Image result for tdp bjp

          అన్నిటికీ మించి రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన వాటిపై వైసీపీ ప్రస్తావించకుండా టీడీపీపైన విమర్శలు చేయడం, బీజేపీ కూడా వైసీపీని పల్లెత్తు మాట అనకుండా టీడీపీపైనే కత్తులు నూరుతుండడం ఆ రెండు పార్టీల మధ్య దూరం పెంచేసింది. అదే సమయంలో ఆంధ్రాకు హోదా ఇవ్వడం కుదరదన్న నీతిఆయోగ్.. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు కొనసాగించేందుకు సిద్ధమవడం కూడా టీడీపీకి ఆగ్రహం తెప్పిస్తోంది. అన్నిటికీ మించి.. ఇంత రచ్చ జరుగుతున్నా బీజేపీ అధిష్టానం తరపున మోదీ లేదా అమిత్ షా .. చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడలేదు. దీంతో.. బీజేపీ కూడా టీడీపీతో కలిసుండేందుకు సిద్ధంగా లేదని అర్థమవుతోంది. ఇవన్నీ రెండు పార్టీల మధ్య దూరం పెంచడానికి దారితీసిన కారణాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: