నానాటికి దేశంలో ఆడవాళ్ళకు రక్షణ కరువవుతుంది.ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా,ఎన్ని చట్టాలు రూపొందించినా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచదేశాలను పరిశీలించి చూస్తే ఆడవాళ్ల మీద జరిగే దాడుల్లో భారత్ మొదటి 15 స్థానాల్లోపు ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అంచనావేయవచ్చు. తాజాగా తమిళనాడులో జరిగిన ఒక సంఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది.


సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉంటూ ఒక ఉపాధ్యాయుడు చేసిన పని ఆ వృత్తికే కళంకాన్ని తెచ్చిపెట్టింది. వివరాల్లోకెళితే తమిళనాడులోని విల్లుపురం జిల్లా, మేల్‌మలైనూర్‌ కు చెందిన నిర్మల్ వృతి రీత్యా ఉపాధ్యాయుడు. వయస్సు 48 సంవత్సరాలు. మేల్‌మలైనూర్‌లోని సెయింట్‌ ఆంటోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు.


తరగతి గదిలో సబ్జెక్టు పాఠాలు వివరించకుండా ప్రేమపాఠాలు చెప్పేవాడు. గడిచిన ప్రేమికుల రోజు ఫిబ్రవరి 14 న 13ఏళ్ల విద్యార్థినికి గులాబీ పువ్వు ఇస్తూ ‘ఐ లవ్‌ యూ’ చెప్పి లవ్ ప్రపోజ్ చేశాడు. తనకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడే ఒక్కసారిగా అలా ప్రవర్తించడంతో బాలిక ఒకింత షాక్ కు గురయ్యింది. దీంతో ఏడుస్తూ ఇంటికెళ్లి కీచక గురువు నిర్వాకాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. కాగా బాలిక తల్లిదండ్రులు  పోలీసులను ఆశ్రయించగా వారు అతని మీద ఎఫైఆర్ నమోదు చేసి అతనికి సహకరించిన మరో ఇద్దరు టీచర్లను కూడా అరెస్టు చేసి విచారిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: