సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో మనుషులు వెళ్తే ప్రమాదం అని చెబుతారు. చరిత్రలో కొన్ని ప్రమాదకరమైన ప్రదేశాల గురించి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.  తాజాగా భారత దేశంలో ఓ నది పేరు చెబితే..అటు వైపు వెళ్లాలంటే వెన్నుల్లో వణుకు వస్తుందని...చావుకు కేరాఫ్ అడ్రాస్ అని చెబుతున్నారు.  ఇంతకీ ఆ నది ఏమిటీ..అది ఎక్కడ ఉందీ..అన్న వివరాల్లోకి వెళితే..ఢిల్లీలో యమునా నదిలోని ఒక పాయ రోహిణీ మీదుగా ప్రవహిస్తుంది. ఆ నదిలో ఎవరైనా స్నానానికి దిగినా, పొరపాటున అందులో పడినా... అది అమాంతంగా మిగేస్తుంది. 
Image result for khuni revar
సాధారణంగా నదిలో ఎవరైనా పడిపోతే..మునిగిపోతే..వారి శవాలు ఎక్కడో అక్కడ కనిపిస్తాయి..కానీ ఆ నదిలో మునిగితే మాత్రం శవాలు మాయం అవుతాయి..విచిత్రం ఎంటంటే..ఆ నది ఎంతో లోతైనది అంటే తప్పులో కాలేసినట్లే..అక్కడ నీరు కూడా మోకాలి లోతు ఉంటుంది. గతంలో అక్కడ ఆత్మహత్యలు, స్నానాలు చేస్తూ గల్లంతైన వ్యక్తుల కోసం జల్లెడపట్టి వెతికినా ఇప్పటివరకు కనిపించలేదు. అది మనుషులను మింగేస్తుందని స్థానికులు చెబుతున్నారు. దీంతో ఆ నదికి ‘ఖూనీ నది’ అని పేరు పెట్టారు. అయితే నది దగ్గర తమకు ఎవరో ఏడుస్తున్న శబ్దాలు, ఒకరకమైన భయానక అరుపులు వినిపించాయని స్థానికులు చెబుతుంటారు.
Image result for khuni revar
ఒకప్పుడు ల్లీని పాలించిన నిరంకుశ పాలకులు ఈ నది వద్దే మరణ శిక్షలు విధించేవారనే కథ ప్రచారంలో ఉంది. ఇక్కడ తలలు నరికి శవాలను నదిలో పడేసేవారని, దీంతో నది రక్తసిక్తమై ‘ఖునీ నది’గా మారిందని చెబుతుంటారు.  మరికొందరు..అక్కడ కొంత కాలంగా నీరు తక్కువగా ఉండి..ఊబిలాంటిది ఏర్పడటం వల్ల అందులో మునిగిన వారు కనిపించకుండా పోతున్నారని అంటున్నారు. అయితే అక్కడ చనిపోయిన వ్యక్తులంతా ఏమైపోయారు? వారి శవాలు ఏమవుతున్నాయనేది ఇప్పటికీ మిస్టరీనే. 


మరింత సమాచారం తెలుసుకోండి: