విభజనకి  గురైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవలసిన కేంద్రం మొండిచెయ్యి చూపించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వం మీద నిప్పులు చెరుగుతూ పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో అధినేత చంద్రబాబు పోరాటం చేస్తుంటే రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు మాత్రం నోరు మెదపకుండా కామ్ గా కూర్చున్నారు.


ఈ పరిణామంతో రాష్ట్ర ప్రజలలో రాష్ట్రప్రభుత్వం మంత్రుల మీద తీవ్ర అసహనం నెలకొంది. అయితే మంత్రులు మాత్రం కేంద్రం పై సీరియస్ ఆవ్వకుండా రాష్టానికి రావాల్సిన నిధులు వచ్చేవరకూ సంయమనం పాటించాలని సలహాలు ఇస్తున్నారట..అయితే ఈ విషయం సరైనదే అయినా సరే సీఎం మాత్రం కేంద్రం పై నిప్పులు చెరుగుతున్నారు.


అయితే కేంద్రం విషయంలో నాన్చుడు ధోరణి చేస్తే రాజకీయంగా నష్టపోతామని అన్నారట కొందరు మంత్రులు..ఇదిలా ఉంటే మరికొందరు మంత్రులు అయితే అస్సలు ఈ విషయాలు పట్టించుకోకుండా ఉండటం వారి వారి సొంత వ్యాపకాలు చూసుకోవడం చేస్తున్నారట.


మరికొంతమంది మంత్రులూ అయితే  ఈ విషయాలు మా పరిధిలోకి కావు ఇలాంటివి ముఖ్యమంత్రి చూసుకోవాలి అని సైలెంట్ గా ఉన్నారట. మొత్తంమీద రాష్ట్ర మంత్రుల వ్యవహారం రాష్ట్ర ప్రజలకు తీవ్ర అసహనం కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: