ఇప్పటి వరకు తమిళనాడులో ప్రముఖంగా అన్నాడీఎంకే, డీఎంకే పార్టీ ల పేర్లు వినిపిస్తు ఉండేవి.  ఒకప్పుడు ఎంజీఆర్, కరుణానిధి ల మద్య హోరా హోరీగా రాజకీయాలు నడిచేవి..ఎంజీఆర్ మరణం తర్వాత ఆయన స్థానంలో జయలలిత అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టి కరుణానిధికి ధీటుగా పోరాడింది. ఇక జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో చిచ్చులు మొదలు కావడం..శశికళ వర్సెస్ పన్నీరు సెల్వం ల మద్య రాజకీయ యుద్దం కొనసాగడం..అనూహ్యంగా పళని స్వామి సీఎం పీఠం ఎక్కడం..తర్వాత పళని స్వామితో బద్ద శత్రువైన పన్నీరు సెల్వం కలవడం ఇలా ఎన్నో ట్విస్టులు అక్కడ నెలకొన్నాయి.  ఈ నేపథ్యంలో తమిళనాడులో రాజకీయాలు బ్రస్టు పట్టి పోయాయని సూపర్ స్టార్ రజినీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. 
Image result for jayalalitha karunanidhi
కమల్‌ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం స్వస్థలం రామేశ్వరం చేరుకొని కలాం సోదరుడు మహమ్మద్‌ ముతుమీర లెబ్బాయ్‌కు చేతి గడియారం కానుకగా ఇచ్చారు. 
సాధారణ గృహాల్లో నివసించడంలోనే గొప్పతనం ఉందని.. కలాం వంటి గొప్ప వ్యక్తి పుట్టిన రామేశ్వరం నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కమల్‌ అన్నారు.  తాను అంత్యక్రియలకు హాజరుకాను కాబట్టే కలామ్ అంత్యక్రియలకు రాలేదని చెప్పారు. ఆయన చదివిన పాఠశాలకు వెళ్లాలని భావించానని, కానీ స్కూల్ యాజమాన్యం అందుకు అనుమతించలేదని చెప్పిన కమల్, తనను అడ్డుకున్నారే తప్ప, ఆయన్నుంచి తాను నేర్చుకోవాలనుకున్న విషయాలను అడ్డుకోలేకపోయారని వ్యాఖ్యానించారు. 
Kamal Haasan, Kamal Hasan, Kamal Haasan political party, Haasan Madurai rally, Makkal Needhi Maiam,
తాను గాంధీ మహాత్ముడికి వీరాభిమానినని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన హీరో అని వ్యాఖ్యానించారు."నిన్న రాత్రి చంద్రబాబు నాకు ఫోన్ చేశారు. ప్రజలకు సేవ చేసే విధానంపై సలహాలు, సూచనలు ఇచ్చారు" అని ఆయన వ్యాఖ్యానించారు.  "ఐ యాం ఏ ఫ్యాన్ అఫ్ చంద్రబాబు నాయుడు" అని ఒక జాతీయ ఛానల్ ఇంటర్వ్యూ లో అన్నారు... "ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తే, అన్ని విషయాలు గుర్తుకువస్తాయి.... ఆయన ఇది వారకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతాలు సృష్టించారు... ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లాంటి నూతన రాష్ట్రానికి, మళ్ళీ అద్భుతాలు చేస్తున్నారని అన్నారు.

Image result for kamal hassan party logo

ఏపీ సీఎం పనితనం అద్భుతం (హీ ఈజ్ కమెండబుల్)... ఆయనకు చేతనైన దాంట్లో, ఆయన చెయ్యదగ్గ వరకు, ఆయన చేస్తున్నారు... హి ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్ అంటూ, అందుకే నాకు చంద్రబాబు అంటే ఇష్టం, అందుకే నేను చంద్రబాబుకి ఫ్యాన్ అంటూ, కమల్ హసన్ చెప్పారు..." సినిమాలకు, రాజకీయాలకూ తేడా ఉందని తాను భావించడం లేదని, రెండు రంగాలూ ప్రజల కోసమేనని వ్యాఖ్యానించిన ఆయన, రాజకీయాల్లో బాధ్యత కాస్తంత ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: