భారతీయ ప్రత్యేకించి తమిళ విలక్షణనటుడు కమల్‌ హసన్ ఎంతో తాత్సారం, ప్రజలు ఆశలు వదిలేసుకున్న తరవాత ఎట్టకేలకు తనదైన అసంఖ్యాక అభిమానుల సమక్షంలో బుధవారం ఇక్కడ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. పేరులో ఏ ఇతర తమిళ రాజకీయ పార్టీలకూ సామ్యం లేని "మక్కళ్ నీది మయ్యమ్-ఎంఎన్‌ఎం-అంటే ప్రజలందరికీ న్యాయం" అనే పేరుతో కొత్త రాజకీయ పార్టీ తమిళనాట ఊపిరిపోసుకుంటోంది. 

Related image

ఎంఎన్‌ఎం అంటే "సెంటర్ ఫర్ పీపుల్స్ జస్టిస్" అని అర్థం. తెలుపు రంగు జెండాపై ఎరుపు, నలుపు రంగులు మిళితమైన పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. చేయి చేయి కలిపి ఉన్న గుర్తును జెండా పై ముద్రించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆవిర్భవ సభకు ఎతర కార్యక్రమాలకు హాజరయ్యారు. కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన కమల్‌హసన్ అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. 

Image result for kamal hasan new party flag inauguration

"నేను నాయకుణ్ని కాదు.. మీ చేతిలో ఆయుధాన్ని" అని ప్రకటించారు. తెలుపు చొక్కా, నలుపు రంగు ఫ్యాంట్ ధరించిన కమల్‌ హసన్ వేదికపై ఉల్లాసంగా కనిపించారు. తరలివచ్చిన వేలాది మంది అభిమానుల కరతాళధ్వనులు జయజయద్వానాల మధ్య కొత్త పార్టీని పేరును ప్రకటించారు. ఆయన చిత్రాల్లో "పాపులర్ పంచ్ డైలాగుల" తో కూడిన బ్యానర్లు, ఫ్లెక్సీలు సభా ప్రాంగణమంతా కనిపించాయి. "నమ్మవారెయే" (మా మనిషి), నలై నమాతే అని రాసుకొచ్చిన బ్యానర్లను అభిమానులు ప్రదర్శించారు. 


Image result for kamal hasan new party flag inauguration

రామేశ్వరం వెళ్లి దివంగత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం సోదరుడి ఆశీస్సులు తీసుకున్న తరువాత కమల్‌హసన్ సభకు హాజరయ్యారు. కాగా తమిళ రాజకీయపార్టీలకు ద్రవిడపేరు ఉండడం సహజం. అయితే విలక్షణ నటుడు కమల్ హసన్ తన పార్టీకి పేరులో  "ద్రవిడ" అన్న పదమే లేదు. బహుశ భవిష్యత్ లో పార్టీని విస్త్రుత పరచటానికి కావచ్చు. కమల్ హసన్ ను ఈ సందర్భంగా అభినందిద్ధాం. 

Image result for kamal hasan new party flag inauguration

దక్షిణ భారత రాజకీయమంతా సినీనటుల నాయకత్వంలోకి పోతున్న దాఖలాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ కర్నాటక లో ఉపెంద్ర తమిళనాట కమల్ హసన్....చూద్ధాం ఎం జరగనుందో?  

Image result for kamal hasan new party flag inauguration

మరింత సమాచారం తెలుసుకోండి: