అవును ఇప్పుడు పరిస్థితులును చూస్తుంటే అలానే, అనిపిస్తుంది. టీడిపి లోకి జంప్ అయిన నాయకుల పరిస్థితి ముందుకా, వెనక్కా అన్నట్టు ఉంది. అస్సలు టీడిపి నుంచి టికెట్ వస్తుందో, రాదో అని డైలమా లో ఉన్నారు. అందుకే అందరు భహిరంగం గానే విమర్శలకు దిగుతున్నారు.  2019 ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం మాత్ర‌మే ఉన్నందున‌, తిరిగి టికెట్ తెచ్చుకునే పనిలో నిమ‌గ్న‌మ‌య్యారు ఆశావాహులు.
Image result for jagan and chandrababu
ఇప్ప‌టికే వేర్వేరు కుంప‌ట్లు పెట్టుకుని త‌మ బ‌లాబ‌లాల‌ను చూపించుకుంటున్నారు. నియోజ‌క‌వ‌ర్గ న‌లుమూల‌లా తిష్ట వేస్తూ క్యాడ‌ర్ ను పోగుచేస్తున్నారు. టికెట్ త‌మ‌దేన‌న్న భ‌రోసాను కార్య‌క‌ర్త‌ల‌కు క‌ల్పిస్తున్నారు. కానీ టికెట్ త‌మ‌కు ద‌క్క‌ద‌ని భావిస్తున్న నేత‌లు మాత్రం తిరుగుబాటుకు వ్యూహాలు ర‌చిస్తున్నారు. త‌మ‌కు టికెట్ ఇవ్వ‌క‌పోతే గోడ దూకేందుకు సై అంటున్నారు. అయితే, మొద‌ట్నుంచి పార్టీనే న‌మ్ముకున్న వాళ్లు, టికెట్ రాద‌ని అనుమాన‌ప‌డుతున్న నేత‌లంతా ఇప్ప‌టికే ప్ర‌త్య‌ర్థి పార్టీలో క‌ర్ఛీఫ్ వేసుకుంటున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.
Image result for jagan and chandrababu
ఈ వార్త‌ల‌ను ప‌క్క‌న‌పెడితే, వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు సైతం తిరిగి జ‌గ‌న్ గూటికి వ‌చ్చేందుకు సిద్ద‌మ‌వుతుండ‌ట‌మే అధికార టీడీపీకి మింగుడు ప‌డ‌ని అంశం. ముఖ్యంగా క‌ర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే మ‌ణిగాంధీ,క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ ఎమ్మెల్యే జ‌య‌రాములు ఫ్లేట్ ఫిరాయించేందుకు రంగం సిద్దం చేసుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌ణిగాంధీ ఓ అడుగు ముందుకేసి చంద్ర‌బాబుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అంద‌రూ అనుకుంటున్న‌ట్లు చంద్ర‌బాబును చూసో, అభి వృద్ధిని చూసో పార్టీ మార‌లేద‌ని,తన‌ను మాత్రం చంద్ర‌బాబు నాయుడు కొనేశాడ‌ని,నేను అమ్ముడుపోయాన‌ని బ‌హిరంగంగా చెప్ప‌టం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య ప‌రుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: