అవును మీరు వింటున్నది నిజమే. ఈ అమ్మాయి చదివింది పదవ తరగతి మాత్రమే కానీ  నెలకు అక్షరాల రెండు లక్షలు సంపాదిస్తుంది. ఆమె పేరు నందిని. వయసు 33 సంవత్సరాలు. కర్నాటక రాష్ట్రంలోని బెంగళూరుకు సమీపంలోని ఒక చిన్న గ్రామంలో ఉంటుంది. ఆమె తండ్రి పూజారి. ఒక దేవాలయంలో పని చేసే వాడు.
Image result for uber dost nandini
నందినికి చిన్నప్పటి నుండి డాక్టర్ కావాలని కోరిక ఉండేది. కాని, కుటుంబ పరిస్థితి అనుకూలించక పోవడంతో ఆమె పదవ తరగతి వరకు మాత్రమె చదివింది. వయసు రావడంతో ఆమెకు పూజారే అయిన వ్యక్తితో పెళ్లి చేసారు. తండ్రి చనిపోవడంతో నందిని చెల్లెలి పెళ్లి భారం పడింది. దీంతో ఆమె చిన్న చిన్న పనులు చేసి డబ్బులు సంపాదించేది.


అయితే అది ఏ మూలకుImage result for uber dost nandini సరిపోక పోవడంతో ఉబెర్ లో కాబ్ సర్విస్ స్టార్ట్ చేసింది. ఒక టయోటా కార్ కొని తిప్పడం మొదలు పెట్టింది. అలాగే ఉబెర్ లో డ్రైవర్స్ ని చేరిపిస్తే వారికి రెఫెరెల్ అమౌంట్ ఇస్తారని తెలుసుకొని, ఒక చిన్న ఆఫీస్ తెరిచి అందులో నుండి దాదాపు 200 మంది డ్రైవర్ లను ఉబెర్ కు పంపించింది. దీంతో ఆమెకు భారీగా లాభం వచ్చిపడింది. ఇప్పుడు ఆమె నెలకు 2 లక్షల వరకు సంపాదిస్తోంది. ఆడది తలచుకుంటే ఏదైనా సాదించవచ్చు అని నందిని నిరూపించింది. కాబట్టి పట్టుదల , కృషి ఉంటె సాధించలేనిది ఏది లేదని ఈ అమ్మాయి మరో సారి నిరూపించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: