అంధ్రప్రదేశ్లో  ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్న టాపిక్ ప్రత్యేకహోదా. ఆశ్చర్యవలసిన అవసరంలేకుండా ఎప్పటిలాగే రాష్ట్రంపై వివక్ష చూపిస్తూ ఈ బడ్జెట్లో కూడా అంధ్రప్రదేశ్ పై మొండిచేయి చూపింది మోడీ సర్కార్. దీనితో ఇప్పుడు  అన్ని పార్టీలు ప్రత్యేకహోదా అస్త్రాన్నే  నమ్ముకొని ఓట్లు సాధించడానికి రెడీ అయిపోయాయి.


గతకొన్నాళ్లుగా టీడీపీ, తమ మిత్ర పార్టీ అయిన బీజేపీ తో పొత్తును తెగదెంపులు చేసుకుంటుంది అన్న వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఇప్పటికైతే బీజేపీ తో పొత్తు కొనసాగిస్తాము, అవసరమైనపుడు ఆ పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటామని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే మొన్న కేంద్రం ప్రతిపాదించిన బడ్జెట్లో రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగినా టీడీపీ పళ్లెత్తు మాటకూడా అనలేదు అని ప్రజలు అనుకోకుండా ప్రత్యేకహోదా అంశాన్ని లేవనెత్తి విమర్శలు చేస్తుంది.


జగన్ కూడా ప్రత్యేకహోదా అంశాన్ని బాగానే వాడుతున్నాడు. ఒక అడుగుముందుకేసి మరీ ప్రత్యేకహోదాపై తన ఎంపీలతో రాజీనామా చేయిస్తానని చెప్పి ప్రజలలో మంచిమార్కులే కొట్టాడు. తాజాగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతా అని మరో బాంబు పేల్చాడు. దీనికి స్పందించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకవేళ జగన్ నిజంగానే అవిశ్వాసం పెడితే తాను జాతీయంగా అన్ని ప్రతిపక్షాల మద్దతును సిద్ధంచేస్తానని ఊహించని ప్రకటన చేశాడు. దీనితో పవన్ పై టీడీపీ కేడర్ మొత్తం గుర్రుగా ఉన్నారు. ఒకవేళ జగన్ నిజంగానే అవిశ్వాసం పెడితే బీజేపీకి వ్యతిరేఖంగా మద్దతు ఇవ్వాలి. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడానికి బాబు సుముఖంగాలేరని మొన్ననే తెలిసింది.

అలాంటి టైములో పవన్ మాటలు బాబును తీవ్ర ఇరకాటంలో పడేసింది. ఒకవేళ మద్దతు ఇవ్వకపోతే, ఇస్తామని ప్రకటనకూడా చేయకపోతే తెలుగువాళ్ళలో అసహనం పెరిగిపోతుందని బాబు తీవ్ర మదనపడిపోతున్నాడట. మొత్తానికి పవన్ చేసిన తప్పిదం బాబును కూడా అడ్డంగా బుక్ చేసింది. ఈ విషయన్ని తెలుసుకున్న జగన్, బాబు పై ప్రస్తుతం పైచేయి సాధించానని, వేసిన ఉచ్చులో భలే ఇరుక్కున్నాడని తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: