విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పినప్పటికీ ఇప్పటి దాకా దాని ప్రసక్తి తీసుకు రాలేదు.  అంతే కాదు ఈ మద్య ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో కూడా ఏపికి పూర్తిగా నిరాశే మిగిల్చారు.  ఇక సినిమా హీరోగా నటిస్తూనే..ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాన్ జనసేన పార్టీ స్థాపించి ప్రజల తరుపు నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. 
 టీ షర్టుపై ఇలా ముద్రించారు...
ఆంధ్రప్రదేశ్ ప్రత్యక హోదా పై అవగాహనా తీసుకు రావడానికి, హోదాపై పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో, యువతను ఉత్తేజ పరిచేందుకు ఆంధ్రప్రదేశ్ లోని యూనివర్శిటీల్లో విద్యార్థులకు జనసేన పార్టీ జనసేన టీషర్టులు పంపిణి చేస్తుంది. ఈ టీషర్టులపై ప్రత్యేక హోదా-ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని ముద్రించారు. మరోవైపు పవన్ సూచనలతో ప్రత్యేక హోదా పోరాటానికి ముందుకు తీసుకెళ్లే దిశగా జనసేన విద్యార్థి విభాగం విధివిధానాలను రూపొందించింది.
 డిజిటల్ ఉద్యమంపై దృష్టి
యువత ఎక్కువగా సోషల్ మీడియాను వాడుతున్న విషయం తెలిసిందే. దాంతో జనసేన డిజిటల్ ఉద్యమానికి శ్రీకారం చుట్ిది. భగత్‌సింగ్ స్టూడెంట్స్ యూనియన్ పేరుతో జనసేన విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నాలు సాగిస్తున్నారు.   ఈ  టీషర్టులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: