వైసీపీ నుండి టీడీపీ కి చాలా మంది ఎమ్మెల్యేలు ఫిరాయించారు. కానీ ఒక ఎమ్మెల్యే ఫిరాయించడం అందరిదృష్టిని ఆకర్షించడంతోపాటు కాస్త ఆసక్తిని రేపింది. ఆయన ఎవరో కాదు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. అలా పార్టీ ఫిరాయించాడో లేదో ఇలా మంత్రిపదవిని దక్కించుకున్నాడు. ప్రస్తుతం రాష్ట్ర మార్కెట్ యార్డు మంత్రిగా కొనసాగుతున్నారు.


మంత్రి ఆది ఈ మధ్య వార్తలలో బాగానే నిలుస్తున్నారు. ప్రత్యేకహోదా కోసం నా ఎంపీలు రాజీనామా చేస్తారు అని జగన్ స్టేట్మెంటు ఇవ్వగా, హై కమాండ్ అనుమతిలేకుండానే మా పార్టీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారు అని చెప్పి బాబు ఆగ్రహానికిలోనయ్యి హుటాహుటిన ప్రెస్ మీట్ పెట్టి తూచ్ అనేశాడు.


తాజాగా చంద్రబాబే అవినీతి సొమ్మును సమానంగా పంచుకోండి అని దిశానిర్దేశం చేశాడని చెప్పి సంచలనానికి తెరలేపాడు. దానికి సంబందించిన వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ - "సీఎం చంద్రబాబు నాయుడే నాకు, మాజీ మంత్రి మరియు ప్రస్తుత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లని కూర్చోబెట్టి పంచాయతీ చేశారు. రూపాయి సంపాదిస్తే నాకు అర్ధరూపాయి, రామసుబ్బారెడ్డికి ఒక అర్దరూపాయి సమానంగా వస్తుంది. రామ సుబ్బారెడ్డి అడిగిన దాంట్లో మనకు సగం వస్తుంది, మనం అడిగినా రామ సుబ్బారెడ్డికి సగం వస్తుంది " అని అక్కడున్న వారినుద్దేశించి మాట్లాడాడు. మరి ఈయన గారి మాటలకు సీఎం సాబ్ పరేషాన్ అవుతారో గుస్సా అవుతారో చూడాలి!


ఇక జమ్మలమడుగు నియోజకవర్గ విషయానికొస్తే ఇది వైఎస్సార్ ఫ్యామిలీ కి కంచుకోట అని చెప్పవచ్చు. టీడీపీ ప్రాభల్యం ఉన్నా కేవలం గట్టి పోటీ ఇవ్వడానికి మాత్రమే పరిమితమవుతూ వస్తుంది. తాజాగా ఆదికి మంత్రిపదవి ఇవ్వడం రామసుబ్బారెడ్డికి అస్సలు నచ్చలేదు. బాహాటంగానే విమర్శలు కూడా చేశాడు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి బుజ్జగించారు. 2019 ఎన్నికలలో ఎవరికి టీడీపీ తరుపున టికెట్ ఇస్తారో తెలియదు కానీ ఇద్దరూ మాత్రం బాబు వద్ద పావులు కదుపుతున్నారంట. వైసీపీ మాత్రం మేము ఎవరిని నిలబెట్టినా ఘనమైన మెజారిటీతో గెలిచి బాబుకు చుక్కలు చూపిస్తాం అనే ధీమాతో ఉందంట. మరి టీడీపీ తరుపున బాబు ఎవరికి సీటు ఇస్తాడో తెలియదు కానీ టీడీపీ గెలవడం ఇంకా సందేహమే అని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: