తెలుగు రాజకీయాల్లో కులం ఓ అంతర్భాగంగా మారిపోయింది. నాయకుడి గుణగణాలను, సామర్థ్యాన్ని బట్టి కాక కులాన్ని చూసి సీట్లు ఇస్తున్నారు. అయితే కేవలం రాజకీయాల్లోనే కులాన్ని చూస్తున్నామా.. చివరకు సినిమా ఫ్యాన్స్ లోనూ కులపిచ్చి బాగా పెరిగిపోయింది. తమ అభిమాన హీరో అంటూ ఆ హీరో కులానికి చెందినవారు. అతని సినిమా ఫంక్షన్లలో సందడి చేయడం కామన్ అయ్యింది.

etv jabardasth కోసం చిత్ర ఫలితం
తాజాగా.. జబర్దస్త్ ప్రోగ్రామ్ లో విపరీతమైన ఆదరణ ఉన్న ఆది కులాలపై ఓ స్కిట్ రూపొందించాడు. అది చూసి జడ్డి నాగబాబు చాలా ఫీల్ అయ్యారు. బాగా చేశావని ఇప్పుడు సమాజంలో ఇలాంటివి చాలా అవసరం అంటూ ఆవేశంగా మాట్లాడారు.  ఆ స్కిట్ లో తమ కులం గీతం అంటూ ఓ కులం వారు తమ కులానికి ఓ గీతాన్ని రూపొందించుకోవడం ఉంది. ఇలా కుల గీతాన్ని రూపొందించుకోవడాన్ని నాగబాబు తీవ్రంగా తప్పుబట్టారు.  

etv jabardasth AADI SKIT కోసం చిత్ర ఫలితం
ఇంకా సమాజాన్ని ఎన్ని ముక్కలు చేస్తారు. ఇంకా కులం అంటూ పట్టుకుని ఎందుకు వేలాడుతారు.. మా కులానికే ఓట్లేస్తాం.. మా కులం వాళ్లనే గెలిపిస్తాం.. ఇలా ఎన్నాళ్లు.. ఇది చివరకు ఎలా తయారైందంటే..  చివరకు మా కులం వాళ్ల సినిమాలే చూస్తాం.. మా కులం వాడు జోకేస్తేనే నవ్వుతాం.. అనే రేంజ్ కు వచ్చేసిందంటూ నాగబాబు సీరియస్ అయ్యారు. ఏ అత్యవసరం అయితే ఓ కులం అని చూసే రక్తం ఎక్కించుకుంటారా.. ఏం మీరు తినే అన్నం ఏ కులం వాడు పంపించాడో మీకు తెలుసా.. మీరు వాడే పనిముట్లు మీ కులం వాడే తయారు చేశారు.. అంటూ కుల గజ్జిని కడిగిపారేశారు. 

etv jabardasth NAGABABU కోసం చిత్ర ఫలితం
అంతవరకూ బాగానే ఉంది. కానీ.. ఇటీవల కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి తమ కులంలోని ప్రముఖులతో ఓ పాట రూపొందించారు. అలాగే ఆ సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి తమ కులం రక్తమే కావాలని ఫేస్ బుక్ లో పెట్టినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి నాగబాబు ప్రసంగం ఆ కులాన్నే టార్గెట్ చేసిందా.. లేక అందర్నీ ఉద్దేశించిందా.. అన్నది హాట్ టాపిక్ అవుతోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: