రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రావర్సీ.. తెలుగు ఛానళ్లలో కాంట్రావర్సీ అంటే పండుగ చేసుకునే ఛానల్ టీవీ9.. దీంతో వర్మకూ.. టీవీ9 కూ దోస్తీ బాగానే కుదిరింది. అందుకే వర్మ ఓ తలతిక్క పని చేసినా టీవీ9 దానిపై లైవ్ పెట్టి నానా రచ్చ చేస్తుంది. అది పాజిటివ్ అయినా.. నెగిటివ్ అయినా.. గంటల తరబడి లైవ్ డిస్కషన్లు నిర్వహిస్తుంది. ఇటీవల వర్మ తీసిన జీఎస్టీ సినిమా విషయంలోనూ అదే జరిగింది. 



కాకపోతే.. ఇక్కడే కాస్త టీవీ9కూ వర్మకూ విషయం చెడింది.. టీవీ9 తనపై అసత్య కథనాలు అల్లుతోందంటూ వర్మ ఒక్కసారిగా టీవీ9 పై ఘాటు విమర్శలు చేశారు. టీవీ9 రజినీ కాంత్ తనపై లేనిపోని కథనాలు టీవీ9 లో ప్రసారం చేయిస్తున్నాడంటూ ట్విట్టర్లో విమర్శలు గుప్పించారు. అంతే కాదు.. టీవీ9 తాను తీసుకునే లీగల్ చర్యలకు బాధ్యులు కావాల్సి వస్తుందని హెచ్చరించాడు కూడా. 


లైవ్ లో లెంపలేసుకున్న వర్మ.. క్షమించేదిలేదన్న లీడర్.. !?
దీంతో టీవీ9 కూడా రామ్ గోపాల్ వర్మపై కక్ష పెంచుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేయాలంటూ విశాఖలో దీక్ష చేస్తున్న మహిళాసంఘాలకు మద్దతుగా టీవీ9 గంటల తరబడి లైవ్ లు నిర్వహిస్తోంది. వర్మను అరెస్టు చేయించాలనే దిశగా కథనాలు ప్రసారం చేస్తోంది. రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేయబోతున్నారని కొద్దిసేపు.. ఇంకెంత కాలం అరెస్టు చేయకుండా ఉంటారని మరికొంత సేపు వాదిస్తోంది. మొత్తానికి వర్మ అరెస్టు అయ్యేవరకూ టీవీ9 కసి తీరేలా కనిపించడం లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: