బహుశ కమల్ తన రాజకీయ రంగ ప్రవేశానికి ముందు రామనాధపురంలో నివసించే భారత మాజీ రాష్ట్రపతి, దేశ ప్రజల ప్రియతముడు అయిన అబ్దుల్ కలాం సోదరుని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. కమల్ తనకై తాను చెప్పుకున్నట్లు ఆయన "అటు లెఫ్టిష్టు కాదు ఇటు రైటిష్ట్ కాదు మితవాది"  అంతా సంశయమే. అంతా కంఫ్యూజనే. మనం ఆయన రాజకీయ రంగ ప్రవేశమూ పూర్తిగా చివరివరకు అయోమయం గందరగోళం. దీన్నిబట్టి ఆయన ఆలోచనలే పూర్తిగా అనుమానాస్పదం సంశయాస్పదం అని బల్లగుద్ది చెప్పొచ్చు. ఆలోచనలకు రూపం లేని ఆయన సిద్ధాంత కర్త ఎలా కాగలడనేది ప్రధాన ప్రశ్న. 
Image result for kamal hassan
తమిళుడు కాని రజనీకాంత్ తమిళ రాజకీయా రంగప్రవేశాన్ని నిరసించాడు. అంటే తనపై తమిళ ప్రభావం పూర్తిగా ఉన్నట్లే కదా! అలాంటి వ్యక్తి దక్షిణ భారతాన్ని ఎలా ఏకీకృతం చేయగలడు. ఇక్కడ తెలుగు, కన్నడ, మళయాళ తదితర బాషా సంస్కృతుల మద్య ఎలా ఐఖ్యత సాధించగలడు? అందుకే ఆయనొక కంఫ్యూజనిస్ట్ ఆయన అనుసరించేది కంఫ్యూజనిజం. తమిళుడు కాని రజనీకాంత్ ముఖ్యమంత్రిగా ఉండటానికి వీలు లేదనే బాషా వాది సరైన నాయకత్వం అదీ లౌకిక ప్రజాస్వామ్య రాజ్యానికి ఎలా ఇవ్వగలడు. 

మొదటి నుంచి తనను తాను మితవాది, హేతువాదిగా ప్రచారం చేసుకునే నటుడు కమల్‌ హాసన్‌కు "అబ్దుల్‌ కలాం స్మారక భవనం" నుంచే తన రాజకీయ ప్రస్థానం, రాజకీయయాత్ర ప్రారంభించడం ద్వారా తమిళనాడు జనాభాలో ఏడు శాతం ఉన్న ముస్లింలను ఆకర్షించవచ్చని భావించి ఉండవచ్చు. ముస్లిములలో కమల్‌ హాసన్‌ పట్ల వ్యతిరేకత విపరీతంగా ఉంది. 2013 లో కమల్‌హాసన్‌ నటించి, నిర్మించిన ‘విశ్వరూపం’ చిత్రం వివాదాస్పదం అవడమే కాకుండా దాన్ని నిషేధించాలంటూ తమిళ ముస్లిం లు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఆ చిత్రంలో ముస్లింలను టెర్రరిస్టులుగా చూపించడమే అందుకు కారణం. చిత్రంలోని కొన్ని సన్నివేశాలను, డైలాగులను తొలగిస్తే సినిమా విడుదలకు అనుమతిస్తామని, లేదంటే లేదని ముస్లిం నాయకులు నాడు హెచ్చరించారు.
Image result for ramanathapuram abdul kalam house
తన సినిమా విడుదల చేయకపోతే తాను దేశం విడిచి మరో దేశానికి వలసపోతానుగానీ సినిమాలో ఒక్క సన్నివేశాన్నిగానీ, డైలాగునుగానీ తొలగించే సమస్యే లేదని కమల్‌ హాసన్‌ ప్రతిఘటించారు అప్పుడు జయలలిత కలగ చేసుకొని కొన్ని సన్నివేశాలు కత్తిరించి సినిమా విడుదల చేయించారు. నాటి నుండి ముస్లిములకు కమల్ హసన్ పట్ల సానుకూలత లేదనే చెప్పాలి. 

తన సినిమా విడుదల చేయకపోతేనే దేశం విడిచి పోతానన్న వ్యక్తి లోని "వ్యక్తిగత స్వార్ధం" ప్రజలకు నాయకత్వం ఎలా వహిస్థాడు.  అందుకే కొత్తగా ఏర్పాటు చేస్తున్న తన రాజకీయ పార్టీ మక్కళ్ నీధి మయ్యం - ఎం ఎన్ ఎం పార్టీకి జయాపజయాలు నిర్ణయించే 7% ఓట్లున్న ముస్లింల మద్దతు కూడగట్టడంలో భాగంగానే ఆయన అక్కడికి వెళ్లినట్లు స్పష్టం అవుతుంది. అయితే ఈయన రాజకీయ ప్రస్థానమే మతం ఓట్ల ప్రాతిపథికన ప్రారంభమైంది. అసలు భారత ప్రజలు అబ్దుల్‌ కలామ్‌ను మైనారిటీగానే పరిగణించనరు. దేశాధినేతగా దేశ ప్రజ హృదయాల్లో ఆయనకు మత కుల వర్గ ప్రాంత విభేద రహిత భావన ప్రత్యేక స్థానం సముచిత గౌరవం ఉంది. ముఖ్యంగా తమిళ నాడు ముస్లిం ప్రజల్లో కూడా అబ్దుల్ కలాంకు ప్రత్యేక స్థానం ఉంది.

Image result for ramanathapuram abdul kalam house

అలాంటి చోట అలాంతి వ్యక్తిని దాదాపుగా ముస్లిం అనే భావనలోకి లాగటం అనేది కమల్ హసన్ ను సాధారణ భారత రాజకీయ నాయకులకు బేధం కనిపించకుండా చేసింది. అంతే కాదు దేశభక్తి పరులకు, తటస్థులకు ఈ చర్య విబెధం కల్పించింది.

అలాంటి చోట అలాంటి వ్యక్తిని దాదాపుగా ముస్లిం అనే భావనలోకి లాగటం అనేది కమల్ హసన్ ను సాధారణ భారత రాజకీయ నాయకులకు బేధం కనిపించకుండా చేసింది. అంతే కాదు దేశభక్తి పరులకు, తటస్థులకు ఈ చర్య విబెధం కల్పించింది. ఆయన తమిళ అయ్యంగార్‌ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తనే కోపం కూడా వారికి ఉంది. ఇలాంటి కులాలు, మతాల పట్టింపు తమిళ ముస్లింలకు ఒకప్పుడు అసలు ఉండేదికాదు. అందుకనే మొదటి నుంచి తమిళనాడు ముస్లింలు ద్రావిడ పార్టీలను, ముఖ్యంగా డీఎంకే పక్షాన ఉంటూ వచ్చారు. 1992లో అయోధ్యలో బాబ్రీ మసీదు విధ్వంసం వారిలో ర్యాడికల్‌ భావాలకు అంకురార్పణ చేశాయి. "క్వాయిద్‌ ఏ మిల్లాత్‌" (మత సామరస్యానికి స్ఫూర్తిదాత)గా గుర్తింపు పొందిన మొహమ్మద్‌ ఇస్మాయిల్‌ నాయకత్వంలోని "ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌" ప్రభావంతో అన్ని కులాలు, మతాలు సమానమన్న స్ఫూర్తితోనే తమిళ ముస్లింలు జీవించారు. తమిళ భాషాభివృద్ధికి వారు కూడా కృషి చేశారు. ద్రవిడ ఉద్యమ వ్యవస్థాపకుడు ఈవీ రామస్వామి కూడా ముస్లింలపట్ల ఎంతో సానూభూతితో, స్నేహభావంతో మెలిగేవారు. ఆ తరవాత పరిణామాలే తమిళ నాట ముస్లిం ప్రభవానికి దారి తీసిన చరిత్ర చెప్పాలంటే ప్రత్యేక వ్యాసం రాయాల్సింది. 

Image result for viswaroopam against muslims

ఆయనకు ముస్లింలు మద్దతిచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించగా ముస్లింల రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చేందుకు సొంతంగానే పలుపార్టీలు ఉన్నాయని, మరో పార్టీ అవసరం లేదని "ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌" అధ్యక్షుడు కేఎం ఖాదర్‌ మొహిద్దీన్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికీ ఆయన రాజకీయాలేమిటో తమకు తెలియవని, ప్రజలు మాత్రం ఆయన "విశ్వరూపం" మరచిపోలేదని అన్నారు. కమల్‌ హాసన్‌ "అటూ ఇటు గాని ఒక గందరగోళం వ్యక్త" అని అని తమిళ ముస్లింల మత చరిత్ర, సంస్కృతిని డాక్యుమెంటరీ రూపంలో తెరకెక్కించిన ప్రముఖ రచయిత, చిత్ర నిర్మాత కొంబాయ్‌ ఎస్‌. అన్వర్‌ వ్యాఖ్యానించారు. 

Image result for kamal hassan wife

అసలు కమల్ హసన్ అబ్ధుల్ కలాం స్మారక సందర్శనే తమిళనాట గందరగోళం సంశయాస్పదమైంది. చివరకు ఆయన వైవాహిక కుటుంబ జీవనమంతా గందరగోళమే. ఎందరో భామలతో ఆయన భామాకలాపం - చివరకు మూడో నాలుగో వివాహాలతో - ఆయన్ను ఆయన నిరూపించుకోలేని వ్యక్తిగత జీవితమున్న కమల్ రేపు తమిళ ప్రజలకు దిశానిర్దేశం చేయగలడనటం అంతా గందరగోళం కకావికలం సంశయాస్పధం.  కమల్ వ్యక్తిగా నటుడుగా ఉన్నతుడు కావచ్చు. బాషాదురభిమానం మతదురహంకారం విభజనవాదం ఆయనను రాజకీయం గా ఎదగనివ్వటం కష్టమే. కమల్ హసన్ అబ్ధుల్ కలాం  ఒకే జిల్లాలో జన్మించారు. అది తప్ప వారి మద్య ఎలాంటి సారూప్యత లేదు. కమల్ హసన్ తమిళనాడు లోని రామనాథపురం లోని పరమకూడిలో జన్మించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: