ప్రపంచంలో టెక్నాలజీ ఎంత పెరుగుతున్నా మూఢ విశ్వాసాలపైనే ఇంకా జనాలు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా దెయ్యాలంటే..ఇప్పటికీ భయపడి చచ్చే వారు ఎంతో మంది ఉన్నారు.   ఇలాంటి మూఢ విశ్వాసాలను కొంత మంది దుర్మార్గులు క్యాష్ చేసుకుంటున్నారు. ఎంతో మంది బురిడీ బాబాలు పుట్టుకొస్తున్నారు.  ఇక చనిపోయిన వారు ఆత్మలు గా తిరుగుతుంటారని అందరూ నమ్ముతుంటారు.  సాధారణంగా దెయ్యలు స్మాశానాల్లో లేదా ఏదైనా పురాతన బంగ్లాల్లో..కర్మకాలితే..మన ఇంట్లోనో ఎక్కడో అక్కడ తిరుగుతుంటాయని తిరుగుతుంటాయని భావిస్తాం.   
Image result for ఆత్మలు
కానీ ఈ భూతాలు రాజస్థాన్‌ అసెంబ్లీలో తిరుగుతున్నాయట. అందువల్లే ఆ రాష్ట్ర ఎమ్మెల్యేలు 200 మంది ఏకకాలంలో ఇంతవరకూ హాజరు కాలేదు. ఈ అసెంబ్లీని శ్మశానవాటికపై నిర్మించడం వల్లే ఎమ్మెల్యేలందరూ ఏకకాలంలో ఇంతవరకూ సభకు హాజరుకాలేక ఉండవచ్చని బీజేపీ ఎమ్మెల్యే బీ సింగ్‌ అన్నారు. ఇటీవల చనిపోయిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఆత్మలుగా మారి తిరుగుతున్నారని, చాలా మందికి కనపడ్డారని చెబుతూ, సెక్రటేరియేట్ లోకి అడుగు పెట్టేందుకు ఎమ్మెల్యేలు భయపడుతున్నారు.
Image result for vasundhara raje assembly
వెంటనే సీఎం వసుంధరా రాజే స్పందించి, భూత వైద్యలను పిలిపించాలని, వివిధ మతాల ప్రార్థనలు జరిపించి, దెయ్యాలను తరిమివేయలేకపోతే తాము రాలేమని ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్న పరిస్థితి.ఈ సెక్రటేరియేట్ ను 2001లో నూతనంగా నిర్మించారు. అంతకు ముందు ఇక్కడ స్మశానం ఉండేదట. అందువల్లే చనిపోయిన ఎమ్మెల్యేలు ఇక్కడ తిరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే హబీబుర్ రెహ్మాన్ వ్యాఖ్యానించారు.
Image result for ఆత్మలు
రాజస్థాన్‌ అసెంబ్లీలో దయ్యాలు ఉన్నాయనే వాదనను కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ధీరజ్‌ గుర్జార్‌ కూడా కొట్టివేశారు. శ్మశానవాటిక మీద అసెంబ్లీని నిర్మించడం వల్లే ఇక్కడ భూతాలు తిరుగుతున్నాయని కేవలం బలహీన మనస్కులు నమ్ముతారని ఆయన అన్నారు. మూఢనమ్మకాలు మరింత వ్యాప్తి చెందడానికి ఇటువంటి ప్రచారాలే కారణమవుతాయని గుర్జార్‌ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: