డబ్బు సంపాదించడానికి ఈ మద్య కొంత మంది దుర్మార్గులు ఎంత నీచమైన పనులకైనా సిద్ద పడుతున్నారు.  సొసైటీలో కష్టపడి పనిచేస్తే..తాము అనుకున్నది సాధించడం కష్టమని..తక్కువ సమయంలో ఎక్కుడ డబ్బు రావాలంటే..అడ్డదారుల్లోనే వెళ్లాలని ఫిక్స్ అయిన కొంత మంది కేటుగాళ్లు హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్, భూ కబ్జాలు, చైన్ స్నాచ్ వంటివి చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.  ఈ మద్య ఫోర్న్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది..ముఖ్యంగా మైనర్లు నుంచి ముదుసలి వరకు ఫోర్న్ వీడియోలకు అలవాటు పడ్డారు. 
UP: CBI arrests administrator of a WhatsApp group that allegedly shared child pornography
దీన్ని క్యాష్ చేసుకోవడానికి కొంత మంది దుర్మార్గులు చిన్న పిల్లలతో అశ్లీల చిత్రాలు, ఫోటోలు తీసి వాట్సాప్ గ్రూపులో అప్‌లోడ్  డబ్బు సంపాదిస్తున్నారు.   ఇలాంటి వీడియోలు, ఫోటోలు విదేశాలకు విక్రయిస్తున్న ఘరానా ముఠా గుట్టును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు రట్టు చేశారు. ఢిల్లీకి చెందిన ‘కిడ్స్’ పేరిట వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసిన ఐదుగురు యువకులు చిన్నారుల అశ్లీల వీడియోలు, ఫోటోలను అప్ లోడ్ చేస్తున్నారు.
Image result for chail porn gand arrest cbi
ఢిల్లీకి చెందిన నిఖిల్ వర్మ, సత్యేంద్ర చౌహాన్, నఫీజ్ రాజా, జాహిద్, ఆదర్శ్ లు బాలికలను లైంగికంగా వేధిస్తున్న వీడియోలు, చిత్రాలు తీసి వాటిని అమెరికా, పాకిస్థాన్, బ్రెజిల్, ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక, కెన్యా, నైజీరియా, మెక్సికో, న్యూజిలాండ్ తదితర దేశాలకు విక్రయిస్తున్నారని సీబీఐ దర్యాప్తులో తేలింది.

కొంత కాలంగా లగ్జరీ జీవితాలకు అలవాటు పడిన ఈ ఐదుగురు ఒక ముఠాగా ఏర్పడి రెండేళ్లుగా ఈ వ్యవహారాన్ని గుట్టుగా సాగిస్తున్నారని వెల్లడైంది. ఛైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను పంపిణీ చేస్తున్న ఈ ముఠాపై సెక్షన్ 67 బి, ఐటీ యాక్టు కింద కేసు నమోదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: