కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌లో తొలిసారిగా జరుపుతున్న అధికారిక పర్యటనకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ట్రూడో, ఆయన కుటుంబం పర్యటనను ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు చాలా వరకు విస్మరించారని సోషల్ మీడియాలో వార్తలు తెగ హల్ చల్ చేశాయి. ఈ నెల 17న ట్రూడో దిల్లీలో విమానం దిగినప్పుడు, ఆయనకు ఒక జూనియర్ మంత్రి స్వాగతం పలికారు. దీనిని ప్రస్తావిస్తూ కెనడా ప్రధాని స్థాయికి తగిన గౌరవం ప్రభుత్వం ఇవ్వలేదని పలువురు విమర్శించిన విషయం తెలిసిందే.
ఫిబ్రవరి 17న కుటుంబ సమేతంగా దిల్లీ చేరుకున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
తాజాగా వీటన్నింటికి చెక్ పెడుతూ..కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కు రాష్ట్రపతి భవన్ లో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రపతి రామ్ నాథ్‌ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ట్రూడో పిల్లలను ఆత్మీయంగా హత్తుకున్నారు ప్రధాని మోడీ. అనంతరం కెనడా ప్రధాని త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. 
కుటుంబ సమేతంగా తాజ్‌మహల్‌ను సందర్శించిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
ఈ క్రమంలో ట్రూడోతో ప్రధాని మోడీ ఇవాళ భేటీ కానున్నారు. వీరిద్దరి మధ్య పలు రక్షణ, వాణిజ్య ఒప్పందాలపై చర్చ జరుగనుంది.  కాగా, వారం రోజులుగా భారత్ లో పర్యటిస్తున్న ట్రూడో ఫ్యామిలీ.. పలు ప్రాంతాలను సందర్శించిన విషయం తెలిసిందే. 

Justin Trudeau By His Side, PM's Message Linked To Khalistan: 10 Facts

మరింత సమాచారం తెలుసుకోండి: