రాజకీయాల్లో సమీకరణాలు ఎంత త్వరగా మారుతాయో అందరికీ తెలిసిందే. ఈరోజు ఉన్న అధికారం రేపు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. తాజాగా అంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా ఒక రకంగా ఇలానే అయిందని చెప్పవచ్చు. కేంద్రబడ్జెట్ ముందు ఒకరకంగా ఉన్న సమీకరణం, బడ్జెట్ తరువాత టీడీపీ స్వరూపాన్నే మార్చివేసింది. ప్రత్యేకహోదా కోసం బాబు ఏం చేయట్లేదు అన్న భావన ప్రజలలో బలంగా నాటుకుపోయింది. 


దీనికితోడు ప్రత్యేకహోదా సాధించడానికి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు బాబుని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. తాజాగా ప్రత్యేకహోదా విషయంపై బాబు తీసుకున్న నిర్ణయంవల్ల పార్టీలో బాబుమీద వ్యతిరేఖత మళ్ళీ తెరమీదకు వచ్చింది. వివరాల్లోకివెళితే ప్రత్యేకహోదా పై కేంద్రం ఏమాట అని తేల్చకపోతే మా పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ డేరింగ్ డెసిషన్ తీసుకోవడమే గాక, అవిశ్వాసమంటూ మరో బాంబు పేల్చాడు. దీంతో బాబు కూడా అవిశ్వాసానికి సై అని స్టేట్మెంటు ఇచ్చేశాడు.


అవిశ్వాసం తీర్మానం పెట్టాలంటే కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాలి. దీనిపై కేంద్ర విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి సుజనాచౌదరితో చర్చించారంట సీఎం చంద్రబాబు. నేను పదవిని వదులుకోవడానికైనా సిద్ధమని చెప్పారంట అశోక్ గజపతి. కానీ సుజనా చౌదరి మాత్రం ఇందుకు ఒప్పుకోలేదట. ఇప్పుడు రాజీనామా చేసినంత మాత్రాన ప్యాకేజీ ఇస్తారా, హోదా ఇస్తారా అని బాబుకే సూటి ప్రశ్నవేశారట. ఇప్పుడు బీజేపీకి వ్యతిరేఖమయితే లేనిపోని తలనొప్పులు వస్తాయి, కావాలంటే అశోక్ గజపతిని రాజీనామా చేయించిన తరువాత వారి తదుపరి చర్యలు చూసి ముందుకు వెళదాం అని ఉచిత సలహా ఇచ్చారంట.


మరింత సమాచారం తెలుసుకోండి: