గతంలో ఒక జాతీయ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన జగన్ మాట్లాడుతూ మా పార్టీ బీజేపీ తో పొత్తు పెట్టుకోవడానికి సిద్దంగా ఉంది, పొత్తు పెట్టుకోవడంలో మాకెటువంటి అభ్యంతరంలేదు, కాకపోతే ఆంధ్రకు ప్రత్యేకహోదా కల్పించాలి. అప్పుడయితేనే మరో మాటలేకుండా స్వతంత్రంగా మేమే పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వస్తాం అని ఆయన తెలిపారు. జగన్ మాటలని బట్టి చూస్తే బీజేపీ తో చేతులు కలిపేందుకు సిద్ధమేనని అప్పట్లో చెప్పకనే చెప్పాడు.


దీనిపై అప్పటిలో పెద్ద దుమారమే రేగింది. టీడీపీ, బీజేపీ నేతలు బహిరంగంగానే విమర్శించుకున్నారు. ఒకానొక దశలో టీడీపీ, తమ మిత్ర పార్టీ అయిన బీజేపీ తో పొత్తును తెగదెంపులు చేసుకుంటుంది అన్న వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఇప్పటికైతే బీజేపీ తో పొత్తు కొనసాగిస్తామని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 


కాగా బడ్జెట్లో ఆంధ్రకు జరిగిన అన్యాయాన్ని వాడుకొని బీజేపీని ఎండగట్టి పొత్తులేకుండానే మెజార్టీ సంపాదించుకుందామనుకొని రాజీనామా, అవిశ్వాసం అనే అస్త్రాలను వాడుతున్నాడు జగన్. ఆయన ఇన్ని కుయుక్తులు పడుతున్నా బీజేపీని ఒక్క మాట కూడా అనలేదు సీఎం చంద్రబాబు. ఆయన మౌనం వెనుక అంతరార్థం లేకపోలేదు. ఈయన కాస్త ఏమైనా అడ్డం తిరిగితే బీజేపీ ఎక్కడ తన చిరునామాని వైసీపీ కి మారుస్తుందో అని భయపడ్డాడు.


కానీ ఇప్పుడు జగన్ తనంతట తానే బీజేపీకి దూరమయ్యే సరికి ఒక రకంగా బాబు సహించి మౌనంగా ఉండటం వల్లనే జగన్ తొందరపాటు  నిర్ణయాలు తీసుకున్నాడేమో అని స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి బాబు మౌనం బీజేపీ, వైసీపీ ల పొత్తు కలగకుండా బాగానే ఉపయోగపడింది. ఈ విషయంలో బాబు విజయం సాధించాడని చెప్పవచ్చు. కానీ జగన్ తొందరపాటు నిర్ణయాల వల్ల కాస్త నిరాశచెందినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రత్యేకహోదా ఇవ్వలేదని బీజేపీపై ఎన్ని విమర్శలు వస్తున్నా వారు మాత్రం పట్టించుకోవడం లేదు. ఎన్నికల ముందు రాష్ట్రప్రజలకు ఒక సర్ప్రైజ్ ఇస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే బాబు వహించిన మౌనానికి బీజేపీ వారితో   పొత్తును కంటిన్యూ చేస్తారని తెగ మదనపడిపోతున్నాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: