ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలు ఏం చేసినా పెద్ద సెన్సేషన్ అవుతుంది.  ముఖ్యంగా సోషల్ మాద్యమాల్లో సెలబ్రెటీల ఫ్యాన్స్ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది.  ఒకప్పుడు తమ అభిమానులతో సంప్రదించాలన్నా..కలవాలన్నా సినిమాల ప్రమోషన్లు చేయాలన్నా చాలా ఇబ్బందులు ఉండేవి. కానీ ఈ మద్య సెలబ్రెటీలు సోషల్ మాద్యమాల ద్వారా తమ ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తూ ఇమేజ్ విపరీతంగా పెంచుకుంటున్నారు. 
Image result for Kylie Jenner
తాజాగా ప్రముఖ మోడల్ రియాలిటీ స్టార్ కైలీ జెన్నెర్ చేసిన ఒక ట్విట్ తో స్నాప్ చాట్ మార్కెట్ విలువను 1.3 బిలియన్ అంటే  రూ.8,422 కోట్ల మేరకు పడిపోయింది.   ఇంతకీ ఈ అమ్మడు చేసిన ట్విట్ ఏంటంటే.. ‘‘అయితే ఇకపై స్నాప్‌చాట్‌ను ఓపెన్ చేయనివారెవరైనా ఉన్నారా? నేనొక్కదాన్నేనా... అబ్బా, ఇది చాలా శోచనీయం’’.

గురువారం వాల్ స్ట్రీట్ ఓపెన్ అయిన తర్వాత జరిగిన ట్రేడింగ్‌లో స్నాప్ ఇంక్ షేర్ విలువ 18.50 డాలర్లు పలికింది. మధ్యాహ్నం 2 గంటలకు దీని విలువ 17 డాలర్లకు పడిపోయింది. చివరికి 17.50 డాలర్లకు చేరింది.   ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే గమనించి  కైలీ మరో ట్వీట్ చేసింది. ‘‘నే నింకా నిన్ను ఇష్టపడుతున్నాను స్నాప్... మై ఫస్ట్ లవ్’’ అంటూ ట్వీటినప్పటికీ, కంపెనీకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

కైలీ జెన్నెర్ కు సామాజిక మాధ్యమాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫోటో షేరింగ్ ప్లాట్ ఫామ్ అయిన స్నాప్ చాట్ 2017 డిసెంబర్ క్వార్టర్లో అమెరికా మార్కెట్లో ఫేస్ బుక్ కంటే ఎక్కువ మందిని ఆకర్షించింది.ట్విటర్‌లో ఆమెను 2.45 కోట్ల మంది ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: