భార్యాభర్తల మధ్య సరైన అవగాహన లేకపోతే.. ఆ గ్యాప్ ను కొందరు దుర్మార్గులు ఎలా వాడుకుంటారో తెలియజెప్పే ఉదాహరణ ఇది. చిత్తూరు నగరంలో జరిగిన ఈ ఉదంతం భార్యాభర్తలకు కనువిప్పులాంటింది. ఆమె ఓ వివాహిత.. రెండేళ్ల కిందట పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. కాపురం బాగానే సాగుతోంది. ఇంతలో భర్తకు బెంగళూరులో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. 

sex crime కోసం చిత్ర ఫలితం
ప్రస్తుతానికి భర్త బెంగళూరులో ఉంటూ భార్యను చిత్తూరులోనే ఉంచాడు. భర్తకు దూరంగా ఉన్న భార్యకు మాజీ ప్రేమికుడు పవన్ కుమార్ దగ్గరయ్యాడు. మాయమాటలు చెప్పాడు. శారీరకంగా దగ్గరయ్యాడు. అంతటితో ఆగాడా.. శారీరక సంబంధాన్ని సెల్ ఫోన్ లో వీడియోల రూపంలో బంధించాడు. దాన్ని చూపించి పలుసార్లు అత్యాచారం చేశాడు. అంతేకాదు.. ఈ వీడియోలు చూపి బెదిరించి చివరకు ఆ ప్రేమికురాలిని వ్యభిచారంలోకి దింపేందుకు కూడా ప్రయత్నించాడు. 

sex crime కోసం చిత్ర ఫలితం
ఇక ప్రియుడి ఆగడాలు భరించలేని ఆ భార్య.. చివరకు భర్తకు అసలు నిజం చెప్పేసింది. తనను మోసం చేసిన ప్రియుడిపై పోలీసు కేసు పెట్టింది. తన మాజీ ప్రేమికుడు తనను శారీరకంగా వాడుకొని వ్యభిచార వృత్తిలోకి దింపడానికి  వేధిస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  భర్త ప్రకాష్‌తో పోలీసుస్టేషన్‌కు వచ్చిన ఆమె మీడియా ప్రతినిధుల సమావేశంలో తన గోడు వెళ్లబోసుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: