ఎ.బాబు... ఈయనో ఐఏఎస్ అధికారి.. చంద్రబాబు బాగా నమ్మిన అధికారుల్లో ఈయన ఒకరు. చంద్రబాబు వద్ద పని చేసే ఐఏఎస్ లలో టెక్నికల్ గా, సాఫ్ట్ వేర్ అంశాలపై బాగా పట్టున్న అధికారి. అందుకే చంద్రబాబుకు బాగా దగ్గరయ్యారు. ఆధార్ లింకు, బయోమెట్రిక్ వంటి అంశాలను అనుసంధానం చేసిన విషయంలో ఆర్టీజీఎస్ రూపకల్పనలో బాబు ఎ పాత్ర చాలా కీలకం. అందుకే చంద్రబాబు ఈయన్ను ఆర్జీజీఎస్ కు సీఈవోగా నియమించారు. 

BABU A కోసం చిత్ర ఫలితం
గతంలో ఈ బాబు ఎ ను చంద్రబాబు పలువేదికలపై ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ల సమావేశాల్లో ఏకంగా అందరి ముందు సన్మానం కూడా చేశారు. కానీ అదే ఐఏఎస్ అధికారి ఇప్పుడు చంద్రబాబు చేత చీవాట్లు తింటున్నారు. సరిగ్గా పనిచేయడం లేదనే అసంతృప్తి కలిగిస్తున్నారు. ఇంతకూ అసలు ఏమైంది.. బాబు.ఎపై చంద్రబాబు ఎందుకు ఆగ్రహంగా ఉన్నారు. ఇందుకు దారి తీసిన పరిస్థితులేమిటి.. ఓ సారి పరిశీలిస్తే.. 


చంద్రబాబు ఆర్జీజీఎస్ లో భాగంగా  1100 పరిష్కార వేదిక కాల్ సెంటర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనికి వచ్చిన ఫిర్యాదులు, ఫీడ్ బ్యాక్ ఆధారంగా మంత్రుల పనితీరు కూడా అంచనా వేస్తున్నారు. ఐతే.. ఆర్టీజీ సీఈఓ అహ్మద్ బాబు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇచ్చిన ప్రజెంటేషన్ మంత్రుల్లో అసంతృప్తికి కారణమైంది. బాబు.ఎ రూపొందించిన ప్రజంటేషన్ తప్పుల తడకగా ఉందని వారు చెబుతున్నారు. 


జన్మభూమిలో వచ్చిన కొన్ని అర్జీలను.. ఆర్థికేతర అర్జీల జాబితాలో కలిపేయడం వల్ల చాలా తప్పులు వచ్చాయట. దీంతో ఐఏఎస్ లు చంద్రబాబుకు పూర్తిగా తప్పుడు నివేదికలిస్తున్నారంటూ మంత్రులు మండిపడుతున్నారు. ఈ విషయాన్ని పరిశీలించిన చంద్రబాబు మంత్రుల ఫిర్యాదులో వాస్తవాలు ఉన్నట్టు గ్రహించారు. ఎందుకు ఇంత అశ్రద్ధగా ఉంటున్నారని బాబు ఎ పై మండిపడ్డారు. అందరి ముందూ అక్షింతలు వేశారు. అదీ కథ. 



మరింత సమాచారం తెలుసుకోండి: