రాజకీయమంటేనే ఎత్తుకు పైఎత్తులు వేయడం.. ఒకరిపై మరొకరు పైచేయి సాధించడం.! ఏపీలో ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయం మరింత రసవత్తరంగా ఉంటుంది. ఎత్తులు, పైఎత్తులు వేసుకోవడంలో ఆ పార్టీలు ఏమాత్రం వెనక్కు తగ్గవు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలకు ముహుర్తం ఖరారవడంతో వ్యూహాల అమల్లో రెండు పార్టీలూ బిజీ అయిపోయాయి. మరి నెగ్గేదెవరు..?

Image result for rajyasabha elections

దేశవ్యాప్తంగా 58 రాజ్యసభ స్థానాలకు మార్చి 23న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి వచ్చే నెల 5న నోటిఫికేషన్ రానుంది. ఆంధ్రప్రదేశ్ లో 3 స్థానాలకు, తెలంగాణలో 2 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఏపీలో జరగనున్న 3 స్థానాల్లో ప్రస్తుత బలాబలాలను బట్టి టీడీపీకి 2, వైసీపీకి 1 సునాయాసంగా దక్కుతాయి. అయితే అలా జరిగితే రాజకీయం ఎందుకవుతుంది.? వైసీపీకి ఆ ఒక్కటి కూడా దక్కకుండా చేసేందుకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎత్తుగడలు వేస్తున్నారు. ఇప్పటికే 22 మంది వైసీపీ ఎమ్మెల్యేలు సైకిలెక్కారు. మరో ఇద్దరిని లాక్కుంటే చాలు వైసీపీ వ్యూహం మొత్తం బెడిసికొడుతుంది.

Image result for cbn vs jagan

ప్రస్తుత సంఖ్యాబలాన్ని బట్టి ఒక్కో అభ్యర్థి గెలుపునకు 45 మంది ఎమ్మెల్యేలు అవసరం. 2 స్థానాల్లో గెలవడానికి టీడీపీకి 90 మంది అవసరం. అందుకు ఆ పార్టీకి వచ్చిన ఢోకా లేదు. ఎందుకంటే పార్టీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి టీడీపీకి 126 మంది ఉన్నారు. కాబట్టి 2 స్థానాల్లో గెలవడం చాలా ఈజీ. మూడో సీటుకు పోటీ పెడితే తప్పకుండా మరికొందరిని లాక్కోవాల్సి వస్తుంది. అప్పుడు బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీకి మద్దతివ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ వైఖరి ఎలా ఉంటుందనేది అంతు చిక్కడం లేదు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి సురేష్ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపినందున ఈసారి కూడా తమ వెంటే నడుస్తుందని టీడీపీ విశ్వసిస్తోంది.

Image result for cbn vs jagan

2 సీట్లకు 90 మంది ఎమ్మెల్యేలు పోతే 3వ స్థానం కోసం మిగిలిన ఎమ్మెల్యేలు పోటీ పడతారు. మొత్తం 175లో గాలి ముద్దుకృష్ణుమనాయుడు మరణంతో ఓ స్థానం ఖాళీ అయింది. అంటే 174లో 90 స్థానాలు పోగా 84 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. వీరిలో 45 మంది వైసీపీ సభ్యులున్నారు కాబట్టి ఆ పార్టీ అభ్యర్థి గెలవడం ఈజీ. అయితే మూడో అభ్యర్థి బరిలోకి దిగితే టీడీపీ అనుసరించే వైఖరిని బట్టి వైసీపీ గెలుపు ఆధారపడి ఉంటుంది.బీజేపీ టీడీపీకి మద్దతు ఇవ్వకపోతే ఆ పార్టీ గెలవడం కష్టం. ఒకవేళ బీజేపీ టీడీపీకి మద్దతిస్తే వైసీపీకి ఇబ్బందులు తప్పకపోవచ్చు. వైసీపీ నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీకి మద్దతిస్తే చాలు ఆ సీటు కూడా ఆ పార్టీ ఖాతాలో పడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: