రాజకీయాల్లో కొనడం, అమ్ముడుపోవడం సహజం అని అందరు అనుకుంటున్నారు. అయితే ఈ అమ్ముడు పోయే క్రమం లో నష్ట పోతుంది ప్రజలే అని అందరికి తెలిసిందే. ఎన్నికల్లో విజయం కోసం ఎంతకైనా తెగించడం ఇవాళ రాజకీయాల్లో సర్వ సాధారణం అయిపొయింది. రాజ్యసభ ఎంపీ ఎన్నికలకు గంట మోగడంతో మళ్లీ రాజకీయ చర్చలు బేరసారాలకు సంబంధించిన చర్చోపచర్చలు షురూ అయ్యాయి. ఏపీలో మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. తెలుగుదేశం రెండుస్థానాలను ఖరారుగా గెలుచుకుంటుంది.
Image result for chandrababu naidu
మూడో సీటు విషయంలోనే ఆ పార్టీలో మీమాంస నడుస్తోంది. మూడో సీటును కూడా గ్యారంటీగా దక్కించుకోవాలంటే తెలుగుదేశానికి మరో ఇద్దరు ఎమ్మెల్యేల బలం కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఇంతకాలంగా కూడా ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తూ వస్తున్న తెలుగుదేశం ఇంకా ఫిరాయించే వారు ఎవరైనా ఉంటే ఈ ఎన్నికల్లోగా వారిని తమ పార్టీలో చేర్చుకోవాలని తద్వారా మూడో అభ్యర్థిని గెలిపించుకోవాలని వ్యూహ రచన చేస్తున్నది. అలా సాధ్యం కాకపోయినట్లయితే.. మూడో అభ్యర్థిగా ఇండిపెండెంటును రంగంలోకి దించి, తమ పార్టీలో మిగిలిన ఓట్లు అన్నింటినీ వారికి కేటాయించేలా చూడాలని అనుకుంటున్నారు.
Image result for chandrababu naidu
అదే జరిగితే గనుక.. మూడో సీటు.. ఓటున్న ఎమ్మెల్యేలకు కోట్లకు కోట్ల నజరానాల్ని కురిపించబోతున్నదనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో షురూ అయింది. ఇండిపెండెంటును రంగంలోకి దించేసి.. తమ ఓట్లను కేటాయించేస్తాం.. అనే విధానమే.. మిగిలిన ఓట్ల కోసం తమ పార్టీతోసంబంధం లేకుండా బేరసారాలు చేసుకోవడానికి గ్రీన్  సిగ్నల్ ఇచ్చేయడం అన్నమాట. అదే సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ కూడా నెల్లూరుకు చెందిన వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని రంగంలోకి దించుతోంది. ఆయనైనా ఖరారుగా విజయం సాధించాలంటే కొన్ని ఓట్లు తగ్గుతాయి. ఆ మేరకు బయటినుంచి కొన్ని ఓట్ల మద్దతును పొందవలసి ఉంటుంది. అంటే అచ్చంగా బేరసారాలకు పాల్పడక తప్పదన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: