తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన 'ఓటుకు నోటు' కేసులో కీలక మలుపు తిరిగింది. కేసులో ఏ4 నిందితుడైన జెరూసలేం మత్తయ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటుకు నోటు వెలుగు చూసింది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్ పట్టుబడినట్లుగా ఏసీబీ అభియోగం మోపింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి, ఉదయ్ సిన్హా, సెబాస్టియన్‌లు తొలి ముగ్గురు నిందితులు కాగా, మత్తయ్య నాలుగో నిందితుడు.
ఇక్కడ కేసు పెట్టమని అక్కడ, అక్కడ కేసు పెట్టమని ఇక్కడ
తాను అప్రూవర్‌గా మారుతానంటూ పిటీషన్ వేశారు. అన్ని విషయాలు అత్యున్నత న్యాయస్థానంలోనే చెబుతానని మత్తయ్య అంటున్నారు. తనను చంపడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ఈ కేసులో తన వాదనలు కూడా వినాలని లేఖలో విన్నవించారు. ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేరు కూడా వినిపించింది. స్టీఫెన్ సన్‌తో ఫోన్లో మాట్లాడిన గొంతు చంద్రబాబుదేనని అభియోగాలు ఉన్నాయి.
వారిద్దరూ ఒక్కటయ్యాక తనను దోషిని చేస్తారేమోనని
అది చంద్రబాబు గొంతా కాదా అని తేల్చేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు కూడా పంపించారు. టీడీపీ, టీఆర్ఎస్‌లు తనను వేధిస్తున్నాయని, తనకు అప్రూవర్‌గా మారే అవకాశం ఇవ్వాలని కోరారు. తనను ఉపయోగించుకుని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని ఇరికించాలన్న ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ కేసుకు, తనకూ ఎటువంటి సంబంధమూ లేదన్నారు. వాస్తవాలను బయటకు చెప్పే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఇప్పుడు ఊహించని మలుపు
కేసు హైకోర్టులో ఉన్నప్పుడు ఏపీ ప్రభుత్వం సహకరించిందని, ఇప్పుడు సుప్రీం కోర్టుకు విచారణకు రావడంతో తనకు ఎవరూ సమాచారం ఇవ్వడం లేదని మత్తయ్య చెప్పారు. అందుకే తాను పార్టీ ఇన్ పర్సన్‌గా అప్పియర్ అవుతానని పిటిషన్ వేశానని చెప్పారు. తనకు వాయిదాల గురించి ఇద్దరూ చెప్పడం లేదని, పబ్లిక్ ప్రాసిక్యూటర్ తనకు ఫాలో అప్ ఇవ్వడం లేదని, డేట్ తెలియకుంటే తనకు వారెంట్ జారీ అవుతుందని భయపడి తాను సుప్రీం కోర్టుకు వచ్చానని చెప్పారు.
ఓటుకు నోటు కేసులో కీలక మలుపు; అప్రూవర్‌గా మత్తయ్య
మూడేళ్లుగా తనకు అప్ డేట్స్ ఇచ్చేవారని, ఇప్పుడు ఇవ్వడం లేదన్నారు. ఇప్పుడు తనకు కేసు డేట్స్ చెప్పకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. తాను ఢిల్లీ వచ్చి సీజేని కలిసి తనకు సమాచారం ఇవ్వాలని చెప్పానని, అన్నీ చెబుతానని చెప్పానని, పిటిషన్ వేశానని చెప్పారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులను సీబీఐకి అప్పజెప్పాలని, అప్పుడు మాత్రమే రహస్యాలు బయటకు వస్తాయనన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: