తెలంగాణలో వరంగల్ అర్భన్ కలెక్టర్ ఆప్రపాలి అంటే డేరీంగ్ డాషింగ్ ఉమెన్ అని అంటారు.  ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకుండా ముక్కుసూటిగా వ్యవహరించే నైజం ఉన్న కలెక్టర్ ఆమ్రపాలి పేరు తెచ్చుకున్నారు.  వరంగల్ జిల్లా అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి కాటా వివాహం ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో  జమ్ము కాశ్మీర్‌లోని ఆర్కే రెసిడెన్సీలో అంగరంగ వైభవంగా జరిగింది. 

ఆదివారం జరిగిన ఈ పెళ్లికి వరంగల్ జిల్లా నుంచి కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా హాజరయ్యారు.   వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి పెళ్లి రిసెప్షన్ ఘనంగా జరిగింది. వరంగల్‌లోని కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు రాజకీయ నేతలు, జిల్లా అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. వేదికపై నూతన దంపతులు దండలు మార్చుకోగా... అతిథులు శుభాకాంక్షలు తెలిపి... ఆశీర్వదించారు.

పెళ్లి జరిగింది కాశ్మీర్ లో కాబట్టి తెలుగు రాష్ట్రాల నుండి అందరూ వెళ్లలేక పోయారు.దీనితో ఆమ్రపాలి వరంగల్ లోని కలెక్టర్ క్యాంప్ ఆఫీస్‌లో పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేసారు. రిసెప్షన్ ఘనంగా జరిగింది.

ఆమ్రపాలి తల్లిదండ్రులు పద్మావతి, వెంకటరెడ్డి అతిథుల్ని ఆప్యాయంగా పలకరించారు.   వరంగల్ వచ్చిన దంపతులు ఉదయం భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: