జెరూసలేం మత్తయ్య తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు కేసు’ కీలక పాత్రధారి. ఆయన ఆ కేసుకు ఒక మలుపు. అయితే ఈ కేసులో నిందితుడుగా ఉన్న జెరూసలేం మత్తయ్య సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖలో తాను అప్రూవర్‌గా మారుతానని పేర్కొన్నారు. తనను తనను చంపడానికి కొందరు  ప్రయత్నం చేస్తున్నారంటూ, ఈ కేసుకి సంబంధించి తన వాదనను కూడా వినాలని -మత్తయ్య రాసిన లేఖ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుంది.

Related image

"ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అధికార టీడీపీ, టీఆర్ఎస్ పార్టీలు తనని వేధింపులకి గురి చేస్తున్నాయి. ఈ కేసులో నేను అప్రూవర్‌గా మారడానికి అవకాశం ఇవ్వాలి. కొన్ని వాస్తవాలు బయటకి చెప్పడానికి అవకాశం కల్పించండి. పౌరులకు ఇచ్చిన రాజ్యాంగ హక్కును కాపాడండి. ఈమేరకు చీఫ్ జస్టిస్ కి నేరుగా, లాయర్ తో ప్రమేయం లేకుండా ఆయన రాసిన లేఖ సంచలనంగా మారింది. ఈ కేసుతో తనకసలు సంబంధమే లేదని, నామినేటెడ్ ఎమ్మెల్యే “స్టీఫెన్‌-సన్‌” ని కలవడానికి “ఎమ్మెల్సీ ఎన్నిక” లకు సంబంధం లేదని, క్రైస్తవుల సమస్యలపై చర్చించేందుకే కలిశానని జరూసలెం మత్తయ్య ఆ లేఖలో పేర్కొన్నారు.

Image result for cash for vote supreme court

ఇప్పుడు తనను చంపుతానంటూ బెదిరింపు కాల్స్ కూడా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశాడు. కేసు హైకోర్టులో ఉన్నప్పుడు ప్రతి రోజూ వచ్చి నన్ను కలిసిన వాళ్లు, కేసు క్వాష్‌ అయ్యేవరకు నా వెంటేవున్నవాళ్లు ఇప్పుడు పత్తాలేరని, వారెంట్‌ జారీ అయితే నేను, నా కుటుంబ సభ్యులు జైలుపాలు కావడానికి కుట్రజరుగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు మత్తయ్య. చంద్రబాబు, కేసీఆర్‌ ఏకమయ్యారన్న అనుమానం కూడా వ్యక్తం చేశాడు.


“కోర్టుకు నేనే హాజరై జరిగిన వాస్తవాలన్నీ చెబుతా, నాకు జరిగిన నష్టాన్ని వివరిస్తా, ఈ కేసులో నా నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకుంటా” అంటూ మీడియా ముందు ఆక్రోశం వెళ్లగక్కాడు మత్తయ్య. ఒకవేళ మత్తయ్య అప్రూవర్‌గా మారితే, కేసు ఏ మలుపు తిరుగుతుందన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Image result for cash for vote supreme court

ఓటుకు నోటు కేసులో జెరూసలేం మత్తయ్య కీలక నిందితుడు. కేసులో ఇతడి ప్రమేయం ఉందని ఏసీబీ అభియోగం మోపింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలు అరెస్టయి నప్పుడు మత్తయ్య పోలీసుల నుంచి తప్పించుకుని ఏపీలో తలదాచుకున్నట్లుగా వార్తలొచ్చాయి. నాలుగో నిందితుడు మత్తయ్య లేడు కాబట్టి రేవంత్ ‘బ్యాచ్’కి బెయిల్ ఇవ్వవద్దని అప్పట్లో ఏసీబీ కోర్టులో వాదించింది. ఓటుకు నోటు కేసు కేసు హైకోర్టులో ఉన్న సమయంలో నాకు టీడీపీ సహకరించింది. అయితే కేసు సుప్రీం కోర్టుకు చేరగానే నాకు వీరు ఎవరు సహరించలేదు. నాకు కనీసం సమాచారం కూడా లేదు.

Image result for cash for vote supreme court

నాకు కేటీఆర్‌కి ఫోన్ చేసిన సమయంలో తనను ఈ కేసులో ఇరికించాలని ఏపీ ప్రభుత్వం చూసిందని, సీఎం ఫోన్ ట్యాపింగ్ కొన్ని వాస్తవాలు తెలియాలి" అని మత్తయ్య చెప్పుకొచ్చారు. అయితే మత్తయ్య అప్రూవర్‌గా మారితే పరిస్థితేంటి? వాస్తవాలు చెబుతానంటున్న మత్తయ్య ఏమేం చెప్పనున్నారు? ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఏంటి? అనేది కుండ బద్దలు కొట్టనున్నారా? తదుపరి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? అసలు ఫోన్-ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరగనుంది? మత్తయ్యను చంపడానికి యత్నిస్తున్న దెవరు? తనకెలాంటి సంబంధం లేదంటున్న మత్తయ్య ఎవరెవరి పేర్లు బయటపెట్టనున్నారు?

Image result for cash for vote supreme court

అయితే ఓటుకు నోటు కేసుతో పాటు - దీనితో లింక్ ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసునుకూడా సీబీఐ కు అప్పగించాలని మత్తయ్య కోరడం విశేషం. అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. అయితే నిజానిజాలు తెలియాలంటే మరి కొద్దిరోజులు ఆగాల్సిందే.

 Related image

మరింత సమాచారం తెలుసుకోండి: