కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీ తిసుకున్న అతిపెద్ద  నిర్ణయాలలో జీయస్టీ, నోట్ల రద్దు. ఈ రెండు నిర్ణయాలలో నోట్ల రద్దు వల్ల దేశంలో వున్న నల్లధనం మొత్తం తీసుకొస్తామని చెప్పడం జరిగింది బీజేపీ ప్రభుత్వం..అయితే ఈ క్రమంలో నోట్ల రద్దు నిర్ణయం వల్ల వచ్చిన సొమ్మును ఇప్పటివరకూ భారతీయ జనతా పార్టీ ఎక్కడా వెల్లడించలేదు. అంతేకాకుండా జీఎస్టీ వల్ల దేశంలో ప్రతి సామాన్య మానవుడికి శాశ్వత ప్రయోజనాలు కలుగుతాయి అని చెప్పడం జరిగింది బిజెపి. ఇదిలావుండగా ఇప్పటివరకు ఈ రెండు నిర్ణయాల వల్ల దేశానికి కలిగే మేలేంటో ఇప్పటివరకు స్పష్టం చేయలేదు భారతీయ జనతా పార్టీ.


అయితే ఈ క్రమంలో దేశ ఉపరాష్ట్రపతి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు ఈ  విషయాల మీద స్పందించడం జరిగింది. ఇటీవల సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సులో పాల్గొన్న వెంక‌య్య నాయుడు మాట్లాడుతూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలలో  పెద్ద నోట్ల ర‌ద్దు సాహసోపేతమైన నిర్ణయమని అన్నారు వెంకయ్యనాయుడు….ఈ నిర్ణయం వల్ల దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ నల్లధనం డ‌బ్బంతా ఈ ఒక్క నిర్ణ‌యంతో బ్యాంకుల్లోకి వ‌చ్చేసింద‌న్నారు.


దాని కార‌ణంగానే ఇవాళ్ల బ్యాంకుల వ‌డ్డీ రేట్లు త‌గ్గాయ‌న్నారు. పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం వ‌ల్ల క‌లిగిన గొప్ప ప్ర‌యోజ‌నం ఇదే అన్నారు….మరి అదే విధంగా జీఎస్టీ గురించి మాట్లాడుతూ... జీఎస్టీ కూడా విప్ల‌వాత్మ‌క‌మైన మార్పుల‌కు నాంది ప‌లికిన నిర్ణ‌యం అన్నారు.


ఒకే దేశం ఒకే పన్ను వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతున్నాయన్నారు. జీఎస్టీ, నోట్ల ర‌ద్దు వ‌ల్ల ప్రస్తుతము సమస్యలు ఉంటాయి గానీ భవిష్యత్తులో  వీటి ఫలాలు అద్భుతంగా ఉంటాయన్నారు వెంకయ్యనాయుడు. అయితే ఈ క్రమంలో కొందరు  నోట్ల ర‌ద్దు నిర్ణయం వల్ల వచ్చిన నల్లధనం ఎంత అని అడిగితే...అది రిజ‌ర్వ్ బ్యాంకు తేల్చాల్సిన లెక్క అని వెంక‌య్య దాటేశారు!



మరింత సమాచారం తెలుసుకోండి: