ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకి రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ రోజురోజుకీ పడిపోతోంది. ఇప్పటికే మిత్రపక్ష పార్టీ లైనా టీడీపీ బీజేపీల మధ్య సత్సంబంధం అంతంత మాత్రంగా ఉండడం...మరోపక్క కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలు పట్టించుకోకుండా ప్రేక్షకపాత్ర వహించడం టిడిపి పార్టీకి మైనస్ అని చెప్పవచ్చు.


అయితే ఈ క్రమంలో రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ పార్టీ రోజురోజుకీ బలపడుతోంది….ఆ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర రాష్ట్రంలో పెను సంచలనం సృష్టిస్తుంది...ఈ నేపథ్యంలో  జగన్ నిర్వహిస్తున్న ప్రతి సభకు జనం తండోపతండాలుగా వస్తున్నారు. ప్రతి సభలోనూ ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా  కనబడుతుంది.


అంతేకాకుండా గత ఎన్నికలలో చంద్రబాబు చెప్పినవి అబద్ధాలేనని...ఇప్పుడూ మోసపోయామని జగన్ దగ్గర వెలగక్కుకుంటున్నారు జనం… అయితే ఈ క్రమంలో కొందరు రాజకీయ సీనియర్ నాయకులు వైఎస్సార్సీపీ పార్టీ లోకి రావడానికి తెగ ఉత్సాహపడుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని చంద్రబాబు మొదట్లో ప్రతిపక్ష వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు.


ఆ నియోజకవర్గాల్లో కూడా టీడపీ, వైసీపీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేల మధ్య యుద్ధమే నడుస్తోంది...ఈ  క్రమంలో ఆ నియోజకవర్గంలో ఉన్న నాయకులు జగన్ పార్టీలోకి చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు….వీరిలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు ...వారిలో ప్రముఖులు కొండ్రు మురళి, మానుగుంట మహీధర్ రెడ్డి, డీఎల్ రవీంద్రారెడ్డి లాంటి రాజకీయ అనుభవం కలిగినవారు....జగన్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా రాబోయే రోజులు వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: