ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ భారతదేశంలో సగం రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అయితే ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో బిజెపి పార్టీ పరిస్థితి చూస్తే చాలా దయనీయంగా ఉంది..రాష్ట్రంలో బిజెపి పార్టీ రెండుగా చీలిపోయే పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాయలసీమ ప్రాంతానికి చెందిన బీజేపీ నాయకులను కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. కర్నూలు వేదికగా ప్రత్యేక రాయలసీమ కావాలంటే డిమాండ్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు రాయలసీమ ప్రాంతానికి చెందినవారు.


ఈ సందర్భంగా అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ రాయలసీమ బిజెపి నాయకులపై మండిపడింది...ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇన్నాళ్లూ బీజేపీ నేత‌ల‌కు రాయ‌ల‌సీమ ఎందుకు గుర్తుకురాలేద‌ని ప్ర‌శ్నించారు. క‌మ‌ల‌నాధుల వైఖ‌రిని తీవ్రంగా త‌ప్పుపట్టారు.


తాజాగా ఆ పార్టీకే చెందిన కొంద‌రు నేత‌లు కూడా విష్ణు కుమార్ రెడ్డి నేతృత్వంలో వినిపిస్తున్న సీమ డిమాండ్‌ను ఖండిస్తున్నారు. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు హ‌రిబాబు ఆయ‌న‌ను తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. విష్ణు కుమార్ రెడ్డి వ్యాఖ్య‌లు అసంజ‌మసంగా ఉన్నాయ‌ని ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.


ఇదంతా గమనిస్తున్న జనం తెలుగు దేశం పార్టీని భారతీయ జనతా పార్టీని ఛి కొడుతున్నారు..గత ఎన్నికల్లో కలిసే పోటీ చేసి ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ పార్టీల్లాగా  ఈ రెండు పార్టీలు చేస్తున్నాయన్ని మండిపడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.



మరింత సమాచారం తెలుసుకోండి: