ఇదేంటి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు ముఖ్యమంత్రి అనుకుంటున్నారా.. అవును ఇది నిజం అక్షరాలా నిజం.. చంద్రబాబు తెలంగాణకు కూడా ముఖ్యమంత్రి.. అబ్బే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంగతి కాదండీబాబూ.. ఇప్పుడు ఈ 2018లోనే చంద్రబాబు తెలంగాణకు ముఖ్యమంత్రి.. అదేంటి మరి కేసీఆర్ ఎవరంటారా.. మాకు అదేమీ తెలియదు.


కావాలంటే సాక్ష్యం చూపిస్తాం.. ఏదీ చూపమంటారా..ఇదిగో ఈ విశాఖ సీఐఐ సదస్సులో రూపొందించిన ప్రోగ్రామ్ షెడ్యూల్ చూడండి.. చంద్రబాబు కింద డిజిగ్నేషన్ ఏమని రాసి ఉందో. చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల ముఖ్యమంత్రి.. అని స్పష్టంగా ఉందా లేదా.. ఇప్పుడు చెప్పండి..  చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి అవునా.. కాదా.. ఇదేమీ చిన్నపిల్లలు రూపొందించిన కాగితం కాదు. 


మరి ఇంత బ్లండర్ ఎలా జరిగిందంటారా.. అది తెలియాలంటే.. దాని కింద ఉన్న మరో పేరు చూడాలి.. అవును.. నరసింహన్, గవర్నర్ ఆఫ్ తెలంగాణ.. అదేంటి నరసింహన్ ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ కదా అనుకుంటున్నారా.. అవును.. కానీ ఇక్కడ ఒక్క తెలంగాణకే గవర్నర్ అని రాసి ఉందేంటి అంటారా.. అక్కడే నిర్వాహకులు తప్పులో కాలేశారు. 


ముఖ్యమంత్రిని కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని ప్రింట్ చేయబోయి.. గవర్నర్ తరహాలో ఉమ్మడి ముఖ్యమంత్రి గా రాయించారు.. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ను మాత్రం ఒక్క రాష్ట్రానికే గవర్నర్ గా చూపించారు. సో.. ఇక్కడే చిన్న పొరపాటు జరిగిపోయిందన్న మాట. ఇప్పుడు ఈ కాపీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: