ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి రాష్ట్రాన్ని అవినీతి, అక్రమాలకు నెలవుగా మార్చారనే మాటకు సజీవ సాక్ష్యాలు మరోసారి లభించాయి. గతంలో ఓటుకు నోటు ప్రజాస్వామ్యం పాలనలో ఓ కుదిపేసిన అవినీతికి అన్యాలకు అక్రమాలకు ఒక నిర్వివాద సాక్ష్యం. విశ్వనగర అమరావతి పునాదుల ఇటుకల్లో అవినీతి, ఇసుకలో అక్రమం, సిమెంటులో అన్యాయం ఐరన్ లో అన్యాయం నింపి నిర్మిస్తున్నారు. ఆయన ఇక నిప్పుకాదు ఇక మోసాల గవాక్షం. ఆయన ఎవరిని అవినీతి పరుడు అనకూడదు. ఎందుకంటే ఆయనే దానికి ప్రతిరూపం. ఆంధ్ర ప్రదేశ్ అధినేత ఒక అవినీతి సామ్రాట్ అయితే-ప్రతిపక్షనేత అక్రమాల చక్రవర్తి కావటం అక్కడ మన దురదృష్టం.
Image result for adinarayana reddy rama subbareddy
తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అవినీతికి ఏవిధంగా పాల్పడుతున్నారో, ఒక మంత్రి బహిరంగంగా చేసిన వ్యాఖ్యల్లో స్పష్ట మవుతోంది. అవినీతి చేసుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తమకు చెప్పారని మంత్రి ఆది నారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అంతేకాకుండా మరో టీడీపీ నేతకు అవినీతిలో వాటాలు ఉన్నట్టు వెల్లడించారు. తాను చేసే అవినీతిలో టీడీపీ నేత, మాజీ మంత్రి రామ సుబ్బారెడ్డికి కూడా అర్ధ రూపాయి భాగం ఉందని పేర్కొన్నారు. స్వయానా సీఎం చంద్రబాబు నాయుడే ఐఏఎస్ ఆఫీసర్లని తమతో పాటూ కూర్చోబెట్టి పంచాయతీ చేపించారని తెలిపారు.

Image result for stephenson episode with chandrababu

రామసుబ్బారెడ్డి అడిగిన దాంట్లో మనకు సగంవస్తుంది, మనం అడిగినా రామసుబ్బారెడ్డికి సగంవస్తుంది అంటూ ఆదినారాయణ రెడ్డి అక్కడున్న వారిని ఉద్దేశించి వ్యాఖ్యా నించారు. 'వాళ్లు దాంట్లో ఏది విమర్శించినా నేనైతే పట్టించుకోను, మీరెవరూ దయ చేసి విమర్శించమాకండి. మీకు కావాల్సిన పనులు నన్ను అడగండి. ఎస్ఎంఎస్ లు పెట్టండి. నీను మీ ఎమ్మెల్యేని, పక్కకు పోయినప్పుడే మంత్రిని' అంటూ ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు.

మంత్రి ఆది నారాయణ రెడ్డి వ్యాఖ్యలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీయడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాద్యమాల్లో చక్కర్లు కొడుతోంది. మంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు ఎక్కువయ్యాయి.

Image result for kunti advised pandavas to share draupadi equally

నాడు కుంతి పంచ పాండవులకు ద్రౌపదిని సమానంగా పంచుకొండని అన్యాపదేశంగా చెప్పింది 

Image result for adinarayana reddy rama subbareddy chandrababu

నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎమెల్యేలను తమ నియోజకవర్గంలోని అవినీతి సొమ్మును సమానంగా పంచుకోమన్నారు  


పైగా ఏదో ఒక వీడియో క్లిప్పింగ్ తెచ్చి సీఎంపై, ఐఏఎస్‌లపై ఆరోపణలు చేస్తారా అని రామసుబ్బారెడ్డి ప్రశ్నించడం, బాబుగారి ఫిప్టీ- ఫిప్టీ పంచాయితీ మహిమే అన్నట్టుగా ఉంది. ఎందుకంటే సీఎం పంచాయితీ చేశారని చెప్పింది వార్డు మెంబరో, దారిన పోయే దానయ్యో కాదు. సాక్ష్యాత్తూ ఒక మంత్రి. ఖండించాల్సి వస్తే ఆదినారాయణరెడ్డి పచ్చి అబద్దాలు చెబుతున్నారని రామ సుబ్బారెడ్డి ధైర్యంగా చెప్పాలి. అలాకాకుండా మీడియాదితప్పు, వీడియో బయటకు తెచ్చిన వారిది తప్పుఅనడం జమ్మలమడుగు లో కాసుల కోసం రాజీపడ్డ రాజకీయ పోకడకు నిదర్శనమే.

Image result for stephenson episode with chandrababu

మరింత సమాచారం తెలుసుకోండి: