సోనియాగాంధీకి దశమగ్రహం అడ్డం తిరిగింది, అల్లుడు చేసిన అక్రమాల ఉచ్చు ప్రభావంతో సోనియా చుట్టు ఉచ్చుబిగుసుకునే పరిస్థితులు కనిపిస్థున్నాయి. తాజాగా ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా హర్యానాలోని గుర్గావ్ లో 3.5 ఎకరాల భూమిని బూటకపు ఒప్పందాలతో కైవసం చేసుకున్నాడని ఏకంగా ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా ఆరోపించడం ఇప్పుడు దేశరాజకీయాల్లో సంచలనం సృస్టిస్థోంది.

గతంలో కూడా ఇదే హర్యానాలో వ్యాపారవేత్త అయిన రాబర్ట్ వార్దా సోనియాగాంధీ అధికారాన్ని ఉపయోగించుకుని పలు కంపెనీలకు అక్రమమార్గంలో లబ్దిచేకూర్చి అక్రమంగా సొమ్ము సంపాదించాడని ఆరోపణలు రావడం, అది సిబిఐ కేసు దాకా వెల్లడం, ఎలాగోలా సోనియా తన పవర్ ను ఉపయోగించి దాని నుండి బయట పడిన విషయం తెలిసిందే. తాజాగా వచ్చిన ఆరోపణలతో బిజేపి పాతవాటిని కూడా తిరిగతోడి సోనియాపై దాడికి దిగుతోంది. దీంతో అల్లుని ఉచ్చులో అధినేత్రి సోనియా చిక్కుకుందన్న వాదనలు రాజకీయ వర్గాల నుండి వ్యక్థమవుతోంది.

గుర్గావ్ లో బూటకపు ఒప్పందాలు కుదుర్చుకున్న భూమితో రాబర్ట్ వాద్రా 58 కోట్లు లబ్దిపొందారని, ఇప్పుడు దీని విలువ ఎన్నో రెట్లు పెరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి హర్యానా ప్రభుత్వం సహకరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు ఈ బూటకపు ఒప్పందాల వల్ల హర్యానా ప్రభుత్వం తీవ్రంగా నష్టపోయిందని కూడా ఆరోపణలు వస్థున్నాయి. ఈఅక్రమానికి సంబందించిన దానిపై పూర్థివివరాలతో ఐఏఎస్ అధికారి ఖేమ్కా ఏకంగా నివేదికనే తయారు చేసి సమర్పించడంతో ఇప్పుడు దుమారం రేగింది. అసలే రాహూల్ ను ప్రధాని చేయాలన్న తపనతో రాజకీయాల్లో సతమవుతున్న సోనియాకు అల్లుడు కొత్త చిక్కులు తెచ్చిపెడుతుండడంతో సోనియా తీవ్ర అసహనానికి లోనవుతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి: