శ్రీదేవి మృతిపై యావత్ దేశం, సినీ అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. ఆమెకు నివాళులర్పిస్తున్నారు. యావద్భారతంలొని ఆమే అభిమానులు టెలివిజన్ల ముందు కూర్చొని ఆమె మరణానికి చింతాక్రాంతులై తమ కుటుంబ సభ్యుల కోసం చింతిచినట్లు పరితపిస్తున్నారు.
congresss
అయితే ఈ మనోఙ్జ నటీమణి శ్రీదేవి మరణం పై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనమై మరీ వివాదంగా మారింది. ఆమె మృతి పట్ల చింతిస్తున్నా మని, ఆమె గొప్ప నటి, శ్రీదేవికి మా సంతాపాన్ని తెలియజేస్తున్నామని ట్వీట్ చేశారు. కాని చివర్లో యూపీఏ హయాంలో ఆమెకు 2013 లో పద్మశ్రీ దక్కిందని కాంగ్రెస్ ప్రస్తావించింది.

Image result for congress tweet on sridevi

ఇప్పుడిదే వివాదంగా మారింది. పద్మశ్రీ విషయంలో కాంగ్రెస్ చేసిన ప్రస్తావనపై నెటిజన్లు మండిపడ్డారు. శ్రీదేవి మరణాన్ని కూడా ఇలా రాజకీయం కోసం వాడుకుంటారా? అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇలా విమర్శలు రావడంతో చివరికి, కాంగ్రెస్ ఈ ట్వీట్‌ లో యూపీఏ హయాంలో ఆమెకు అవార్డు దక్కిందన్న విషయాన్ని తొలగించింది.
పద్మశీ అవార్డ్ కాంగ్రెస్ వాళ్ల అబ్బ సొత్తు కాదు! శ్రీదెవికి కూడా ఇవ్వకపోతే ఆ అవార్డుకే విలువుండదు. 

Image result for congress tweet on sridevi

మరింత సమాచారం తెలుసుకోండి: