తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ లీడర్స్ లో మోత్కుపల్లి ఒకరు రాష్ట విభజన జరగక ముందు మోత్కుపల్లి కి పార్టీలో ఎంత కీలకంగా ఉన్నారో..విభజన జరిగిన తరువాత తెలంగాణలో కూడా చంద్రబాబు కీలక భాద్యతలని అప్పగించారు..అయితే రేవంత్ రెడ్డి ఎపిసోడ్ లో మోత్కుపల్లి ఎప్పుడు ఫైర్ అవుతూ ఉండేవారు..రేవంత్ పార్టీని వీడి కాంగ్రెస్ కి వెళ్ళుతున్న సమయంలో కూడా చంద్రబాబు కంటే కూడా మోత్కుపల్లి పల్లి ఎంతో ఫైర్ అయ్యారు...ఈ ఒక్క సందర్భం మాత్రమే కాదు పార్టీపై ఈగ వాలినా సరే మోత్కుపల్లి సహించేవారు కాదు..పార్టీలో క్రమశిక్షణ కి మారుపేరుగా నిలచారు మోత్కుపల్లి..

 Image result for chandrababu naidu

అయితే మోత్కుపల్లి కొంతకాలం క్రితం చేసిన వ్యాఖ్యలు మాత్రం టిడిపిలో అలజడి రేపాయి..తెలంగాణలో పార్టీ ఉండాల్సిన అవసరం ఏముంది పార్టీని టీఆర్ఎస్ లో వీలీనం చేసేయండి అంటూ మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు..ఈ విషయంలో టిడిపి నేతలు మోత్కుపల్లి పై విమర్శలు కూడా చేశారు.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన పార్టీలో ఇలాంటి వ్యాఖ్యలు ఓ కీకల నేత చేయడం కలకలం రేపింది.... మోత్కుపల్లి గురించన పూర్తి రిపోర్ట్ తెలంగాణా నేతలు చంద్రబాబు కి అందచేశారు. .అయితే చంద్రబాబు మోత్కుపల్లి పై చర్యలు తీసుకుంటారు అనుకుంటే అసలు అలాంటి చర్యలు ఏమి లేవు..ఎందుకనంటే..
Image result for mothkupally narsimhulu
టిడిపిలో దళిత నాయకుడిగా.సీనియర్ లీడర్ గా ఉన్న మోత్కుపల్లి కి చంద్రబాబు హామీ మేరకు గవర్నర్  పదవి ఖాయమని డిసైడ్ అయిపోయారు అయితే ఈ విషయంలో పదవి రాకపోయే సరికి ఎంతో అసంతృప్తి వ్యక్తం చేశారు..అంతేకాదు చంద్రబాబు పై ఎన్నో అభ్యంతర కరమైన వ్యాఖ్యలు చేశారు..అలాంటి సమయంలో మోత్కుపల్లి  పై చంద్రాబు చర్యలు చేపడితే ఇక మోత్కుపల్లి  తీవ్రస్థాయిలో రెచ్చి పోవడం ఖాయం అందుకే మోత్కుపల్లి  విషయంలో చంద్రబాబు సంయమనం పాటిస్తున్నారని తెలుస్తోంది.పార్టీలో ఉంటూనే ఇన్ని మాటలు అంటున్న మోత్కుపల్లి..ఒక వేళా పార్టీ నుంచీ బయటకి వెళ్తే పార్టీకి నష్టం చేకూర్చుతారనేది చంద్రాబు అభిప్రాయం అయ్యిఉండచ్చు అంటున్నారు విశ్లేషకులు..

 Related image

 


మరింత సమాచారం తెలుసుకోండి: