టి కాంగ్రెస్ లో అలజడి మొదలయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ సీనియర్ నాయకుడు పార్టీలో చేరుతున్నారన్న విషయంలో తెలంగాణ కాంగ్రెస్ లో ఉన్న నాయకుల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో రెండు గ్రూపులుగా చీలిపోయాయి తెలంగాణ కాంగ్రెస్.


ఇంతకీ విషయం ఏమిటంటే బీజేపీలో ఉన్న ఒకప్పటి టీడీపీ నేత నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ లో  చేరుతారన్న విషయంలో రేగిన చిచ్చు ఇంకా చల్లారలేదు. ఆయన చేరికను పార్టీలో ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, మరో వర్గం నాగంకు మద్దతు పలుకుతోంది. దీంతో పార్టీలో అలజడి మొదలైంది. బస్సుయాత్రకు ముందు ఈ చిచ్చు పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది.


ఒకపక్క గొడవ జరుగుతున్నా మరోపక్క నాగం జనార్దన్ రెడ్డి పార్టీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు.ఈ క్రమంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  నాగం జనార్దన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడానికి తెగ ఉత్సాహపడుతున్నారు...ఈ సందర్భంగా ఉత్తంకుమార్ రెడ్డి నాగం జనార్దన్ రెడ్డిని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ వద్దకు తీసుకెళ్లినట్లు ప్రచారం జరుగుతుండటంతో ఇక ఆయన చేరిక లాంఛనమేనని తెలుస్తోంది.


నాగం చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు….ఈ నేపథ్యంలో వీరు కూడా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కి నాగం యొక్క చరిత్రను తెలియజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు...మొత్తంమీద నాగం ను తెలంగాణ కాంగ్రెస్ లోకి రాకుండా చూస్తున్నారు. ఇక ఎన్నికల ముందు  గ్రూప్ తగాదాలు పార్టీకే నష్టం అంటున్నారు కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: