రేవంత్ రెడ్డి తెలంగాణా రాజకీయాల్లో సెగలు పుట్టించడానికి సిద్దం అవుతున్నాడు..టిడిపి నుంచీ కాంగ్రెస్ లోకి వెళ్లిన రేవంత్ రెడ్డి తెలంగాణా కాంగ్రెస్ లో కీలకమైన నేతగా ఉన్నారు..నాకు పదవులు ముఖ్యం కాదు కేసీఆర్ పాలన నుంచీ తెలంగాణా ప్రజలకి విముక్తి కలిగించడమే ధ్యేయం అని చెప్పే రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు..కేసీఆర్ ఫ్యామిలీ నే టార్గెట్ గా చేసుకుని రేవంత్ చేసే పరుషమైన వ్యాఖ్యలకి కేసీఆర్ ఓ దశలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే శిక్ష తప్పాడు అంటూ జీవో కూడా విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చేలా చేశాడు.

 Image result for revanth reddy

ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో కేసీఆర్ ని ఇరుకున పెట్టే రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా ఓ భారీ వ్యూహరచన చేస్తున్నాడు..ఉమ్మడి రాష్ట్రంగా ఏపీ ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రతో ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు ఆ తరువాత చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేపట్టి సక్సెస్ అయ్యారూ..అయితే విభజన తరువాత కాంగ్రెస్ తరుపున పాదయాత్ర చేయడానికి కోమటిరెడ్డి  వెంకటరెడ్డి - డికె అరుణ తదితరులందరికీ అనుమతి నిరాకరించిన కాంగ్రెస్ అధిష్ఠానం..ఇప్పుడు రేవంత్ రెడ్డికి మాత్రం  గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..

 Image result for revanth reddy bus yaatra

అయితే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు అందరు కలిసి నిర్వహిస్తున్న బస్సు యాత్ర తరువాత రేవంత్ పాదయాత్ర ఉంటుందని అంటున్నారు..ఈనెల 26వ తేదీనుంచి బస్సుయాత్ర ప్రారంభించబోతోంది కాంగ్రెస్  దాని తర్వాత రేవంత్ పాదయాత్ర ఉంటుందని రేవంత్ తో పాటు మల్లు భట్టివిక్రమార్క - పొన్నం ప్రభాకర్ కూడా పాదయాత్ర చేయబోతున్నారు.అయితే వీరు వారి వారి  జిల్లాలకి మాత్రమే పరిమితం అయ్యి పాదయాత్ర చేస్తారు.. రేవంత్ మాత్రం రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తారు...అయితే రేవంత్ వల్ల పార్టీకి మైలేజ్ ఉంటుంది అనడానికి ఇదే నిదర్శనం  అంటున్నారు రేవంత్ వర్గం..

 Image result for komati reddy venkat reddyImage result for ponnam prabhakar

అయితే రేవంత్ కాంగ్రెస్ లో చేరిన నేటికి కూడా పార్టీ పరంగా ఎటువంటి భాద్యతలు ఇవ్వలేదు,..అయితే పాదయాత్ర మొదలు చేసే లోపుగానే రేవంత్ కి తెలంగాణా కాంగ్రెస్ లో కీలక భాద్యతలు ఇవ్వనున్నారని తెలుస్తోంది..అయితే ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ అందుకు ప్రతిగా వ్యూహాలు రచిస్తున్నారని టాక్..ఏది ఏమైనా రేవంత్ రెడ్డి పాదయాత్రతో తెలంగాణాలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ పండితులు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: