భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో కటిఫ్ పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో బిజెపి పార్టీ జగన్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి తెగ ఉత్సాహపడుతోంది. ఈ సందర్భంగా వైసిపి అధినేత జగన్ తో బిజెపి అధిష్టానం మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది.


అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు చేస్తున్న అవినీతి ప్రతి శాఖలో కనబడుతున్న నేపథ్యంలో కేంద్రం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


ఎందుకంటే గత ఎన్నికలప్పుడు టీడీపీ పార్టీతో భారతీయ జనతా పార్టీ జతకట్టి ఓట్లు అడిగిన నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ చేస్తున్న అవినీతి మరకలు తమ పార్టీకి అంటుకుంటాయమో అని అంటున్నారు విశ్లేషకులు….ఇదిలావుండగా జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర కి రాష్ట్రంలో ప్రజల నుండి వస్తున్న స్పందన కూడా ఒకింతా బిజెపి పార్టీ వైసీపీ పార్టీతో జత కడతాయి కారణం అంటున్నారు….అంతేకాకుండా జగన్ పాదయాత్రలో ప్రభుత్వ వ్యతిరేకత మరియు చంద్రబాబునాయుడు మీద అపనమ్మకం స్పష్టంగా కనబడుతుంది.


దీంతో వచ్చే ఎన్నికలలో వైసిపి పార్టీతో బిజెపి పార్టీ కలిసి పోటీ చేస్తాయని అంటున్నారు కొంతమంది రాజకీయ మేధావులు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే నియోజకవర్గాల లిస్టు కూడా సిద్ధం చేసుకున్నారట...ఈ లిస్టు తో జగన్ దగ్గర మంతనాలు జరిపి ఎక్కడెక్కడ పోటీ చేయాలా అని నిర్ణయాలు తిసుకొంటారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: