ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయాలలో ఎంత అనుభవశాలో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఎంత అనుభవం ఉన్నప్పటికీ రాజకీయాలలో చాకచక్యంగా వ్యవహరించకపోతే ఓటమి తప్పదు. మహామహిలయినటువంటి ఇందిరా గాంధీ, వాజ్ పేయిలకు కూడా ఓటమి తప్పలేదు. ఈ విషయం బాబుకి కూడా బాగానే తెలుసు. ఎందుకంటే తన తొందరపాటు నిర్ణయాల వల్ల 2014 లో  అధికారాన్ని వైయస్ చేతుల్లో పెట్టాడు.


ఆ తరువాత విభజన పుణ్యమా అని అనుభవరహిత జగన్ మీద గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠమెక్కాడు. కానీ నిజానికి జగన్ మీద గెలవడానికి చాలానే శ్రమించాల్సి వచ్చింది. అధికారంలోకి రాగానే వైసీపీ నుండి ఫిరాయింపులు జరగడంతో బాబుకు సంతోషం కంటే కాస్త తలనొప్పే ఎక్కువయిందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది నాయకులు ఫిరాయింపు ఎమ్మెల్యేల మీద విమర్శలు చేసి బాబుకు షాక్ ఇచ్చారు. దీంతో స్వయంగా బాబు కలుగచేసుకొని వివాదాలని పరిష్కరించారు.


కానీ ఇప్పుడు బాబుకు మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ అవుతుంది. మొన్న ప్రవెశపెట్టిన బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే టీడీపీ నాయకులు బీజేపీ తో పొత్తు ఉన్నా హోదాపై ఏం చేయడంలేదని తెలుగు ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రజల నుండి ఓట్లు రావడం కష్టతరమే. అంతేగాక ఓట్లు అడగడానికి ఏం మొహం పెట్టుకుని అడుగుతారు. ఇదే విషయాన్ని బాబుకు వివరించారట కొంతమంది. టీడీపీ హోదాపై ఏ చర్యలు తీసుకొనకపోతే ఖేల్ ఖతం అనుకొని పార్టీ ఫిరాయిస్తామని చెప్పారంట కొంత మంది నేతలు. ఇదే జరిగితే పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని బాబు భయపడుతున్నాడట. ఇలాంటి సమయంలో సమావేశం నిర్వహించి వాళ్లలో భయం పోగొట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడంట బాబు.


మరింత సమాచారం తెలుసుకోండి: