కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కొత్త కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. స్వేచ్ఛ ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి రూల్స్ చాలా మందికి రుచించడం లేదు. ముఖ్యంగా సీనియర్ నేతలు చాలా మంది రాహుల్ గాంధీపై గుర్రుగా ఉంటున్నారు. ఇలాంటి రూల్స్ పెడితే తమ భవిష్యత్ ఏమవుతుందనే ఆందోళన చాలా మందిలో కనిపిస్తోంది.

రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొస్తున్న సంస్కరణలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెబులు రేపుతున్నాయి. ఇప్పటికే డీసీసీ లకు నో టికెట్ అంటూ ఒక ఫార్ములా తీసుకువచ్చిన రాహుల్.. ఇప్పుడు మరో ఫార్ములాను తెరపైకి తీసుకువచ్చారు. పార్టీలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నట్టు స్పష్టం చేశారు. అందులో భాగంగా 70 ఏళ్లు దాటిన వారికి ఇకపై టికెట్ ఇవ్వకూడదనే ఆలోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వస్తున్న సమాచారం.

Image result for congress party

రాహుల్ గాంధీ యూత్ ఫార్ములా అమలైతే తెలంగాణలో చాలా మంది లీడర్లకు ఇకపై టికెట్ దక్కపోవచ్చు. పార్టీలో అన్నీ తామై వ్యవహరిస్తున్న చాలా మంది ఈసారి ఇంటికే పరిమితం కావాల్సి వస్తుందేమో.. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, ప్రతిపక్షనేత జానా రెడ్డి, పీఏసీ చైర్మన్ గీతారెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్యకు, మాజీ ఎంపీ వి.హనుమంతరావు తదితరుల వయస్సు 70 ఏళ్లు దాటిపోయింది. దీంతో వీరందరికీ ఈసారి ఛాన్సెస్ లేనట్లే.

Image result for telangana congress

రాహుల్ రూల్ తమను ఎక్కడ చిక్కుల్లో పడేస్తుందోనని భావించిన సీనియర్లు ఇప్పటికే తమ వారసులను తెరపైకి తీసుకువస్తున్నారు. తనకు సీట్ ఇవ్వకపోతే తన తనయుడు రఘువీర్ రెడ్డికి సీట్ ఇప్పించుకునేందుకు జానా రెడ్డి రెడీ య్యారు. గీతారెడ్డి తన కూతురు మేఘనారెడ్డికి, పొన్నాల లక్ష్మయ్య తన కోడలు వైశాలికి టికెట్ ఇప్పించుకునే అవకాశం ఉంది. అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉండే జైపాల్ రెడ్డి.. తనకు టికెట్ దక్కకపోయినా పార్టీ పదవి వస్తుందనే ఆశతో ఉన్నారు.

Image result for telangana congress

రాహుల్ తీసుకురావాలనుకుంటున్న మరో నియమం కూడా చాలా మందికి మింగుడు పడడం లేదు. డిపాజిట్లు కోల్పోయిన వారికి వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వబోరనేది ఆ రూల్. డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారంటే వారికి ఏమాత్రం వ్యక్తిగత ఇమేజ్ లేదనే అంచనాకు వస్తోంది. సీనియార్టీ లాంటివాటిని పక్కన పెట్టి గ్రౌండ్ లెవల్ లో వారి కేపబిలిటీ ఏంటో తెలుసుకున్న తర్వాతే టికెట్లు కేటాయించే దిశగా ఆలోచిస్తోంది. ఇందుకోసం రాహుల్ సరికొత్త టీంను సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం. మరి అదే జరిగితే చాలా మంది నేతలు భవిష్యత్ ఏమవుతుందో..!?


మరింత సమాచారం తెలుసుకోండి: