రానున్నది ఎన్నికల నామ సంవత్సరం కనుక టిడిపి పార్టీకి చెందిన ఎల్లో మీడియా ఛానల్ లో ఒక ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక కొత్త విషయానికి తెరలేపింది. ఈ సందర్భంగా దానికి సంబంధించి కథా కథనాలు సదరు చానళ్లలో ప్రసారం చేయడం మొదలుపెట్టారు.


అసలు విషయం ఏమిటంటే బిజెపి, పవన్ ల మధ్య 2019 కి దోస్తీ. తెలుగుదేశం పార్టీ దూరమైపోతున్నందున ప్రత్యామ్నాయంగా పవన్‌ కల్యాణ్‌ను తమవైపు తిప్పుకొంటే ఎలా ఉంటుందన్న ప్రతిపాదనను బీజేపీ నాయకత్వం పరిశీలిస్తున్నదనీ, పవన్‌ కల్యాణ్‌ చొరవ మేరకే రాష్ట్రానికి ఏదో చేసినట్టు చేసి ఎన్నికలలో ఆయన పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుందన్న అంశం కేంద్ర నాయకత్వం పరిశీలనలో ఉందన్న సమాచారం.


ఈ పరిణామం తో పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ ని స్వయంగా తన దగ్గరకు పిలిచుకుని మంతనాలు జరుపుతున్నాడు అని..ఫోన్‌లో కూడా తరచుగా మాట్లాడుతున్నారనీ సదరు ఎల్లో మీడియా ఛానల్ లో ప్రసారం అవుతున్న కథనం. అయితే ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీకి చెందినవారు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినది కేవలం తెలుగుదేశం పార్టీ ని కాపాడటం కోసమే అంటున్నారు.


అంతేకాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని మోసం చేస్తుంది అని పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన కమిటీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కమిటి అని ఆరోపణలు చేశారు ప్రతిపక్ష పార్టీ నాయకులు.



మరింత సమాచారం తెలుసుకోండి: