ప్రముఖ సినీతార శ్రీదేవి దుబాయ్ లో ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అక్కడ ఆమె భౌతిక కాయానికి పరీక్షలు జరుగుతున్నాయి. అవి పూర్తయ్యాక ఆ పార్ధివ దేహాన్ని ఇండియాకు తీసుకొస్తారు. మరి దుబాయ్ నుంచి ఆమె పార్థివ దేహం ఇండియాకు ఎలా తీసుకొస్తారు. సాధారణ విమానంలో శవాలను తరలించడం కుదురదు. 

sridevi anil ambani కోసం చిత్ర ఫలితం
ఈ సమయంలో శ్రీదేవి కుటుంబానికి సాయం అందించేందుకు రియలన్స్ అధినేత అనిల్ అంబానీ చొరవ తీసుకున్నారు. ఆయన తన ప్రైవేటు విమానాన్ని శ్రీదేవి భౌతిక కాయం తీసుకొచ్చేందుకు పంపించేందుకు ముందుకొచ్చారు. ఆయనకు 13 సీట్ల సొంత విమానం ఉంది. దుబాయ్ లో ఉన్న శ్రీదేవి పార్థివ దేహాన్ని తీసుకొచ్చేందుకు దాన్ని ఆయన ఆదివారం  మధ్యాహ్నమే దుబాయ్ పంపారు. 

sridevi deadbody కోసం చిత్ర ఫలితం
శ్రీదేవి పార్థివ దేహంతో పాటు ముఖ్యమైన ఆమె కుటుంబ సభ్యులు కూడా ఈ విమానంలోనే ముంబై వస్తారు. ఐతే.. శ్రీదేవి అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయన్న దానిపై క్లారిటీ రావడం లేదు. సోమవారం మధ్యాహ్నానికి శ్రీదేవి భౌతిక కాయం ముంబై చేరుకునే అవకాశం ఉంది.

anil ambani aeroplane కోసం చిత్ర ఫలితం

సోమవారమే అంత్యక్రియలు కూడా చేయవచ్చని భావిస్తున్నారు. ఈ విషయంపై క్లారిటీ రావడంలేదు. ముంబైలోని ఆమె నివాసం వద్ద అభిమానులు ఎదురు చూస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: