శ్రీదేవి దుబాయ్ లో మరణించిన విషయం తెలిసిందే. శ్రీదేవి శనివారం అర్థరాత్రి మరణిస్తే.. ఆదివారం అర్థరాత్రి వరకూ కూడా ఆమె భౌతిక కాయాన్ని కుటుంబ సభ్యులకు అందించలేదు. పోస్టు మార్టం విషయంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. సోమవారం మధ్యాహ్నం వరకూ శ్రీదేవి భౌతిక కాయం వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. మరి ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతోంది..?


శ్రీదేవి కోసం.. రియలన్స్ అంబానీ ఏం చేశారో తెలుసా..!?
దీనికి ప్రధాన కారణం దుబాయ్ లోని నిబంధనలే. దుబాయ్ అంటే మన ఇండియాలా కాదు.. అరబ్ దేశం. అన్నీ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందే. సెలబ్రెటీలైనా.. సామాన్యులైనా అంతా ఆ రూల్స్ ఫాలో కావాల్సిందే. అందులోనూ శ్రీదేవి మరణించింది ఓ ప్రైవేటు హోటల్లో.. కాబట్టి ఈ రూల్స్ ఇంకా కఠినంగా ఉంటాయి. శ్రీదేవి భౌతిక కాయాన్ని తీసుకొచ్చేందుకు మన ప్రభుత్వ వర్గాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. 

SRIDEVI DUBAI కోసం చిత్ర ఫలితం
కానీ.. అక్కడి చట్టాలు.. విదేశీ ఎంబసీలు, ప్రభుత్వాల ప్రభావంతో పని చేయవు. వాళ్లు వాళ్ల నిబంధనల ప్రకారమే పని చేస్తారు. శ్రీదేవి మృతదేహాన్ని అక్కడి పోలీసు మార్చురీలోనే భద్రపరిచారు. ఎంత సెలబ్రెటీ అయినా అక్కడ అంతే. ఫోరెన్సిక్‌ పరీక్షలు పూర్తయిన తర్వాతే ఆమె పార్థివ దేహాన్ని అప్పగిస్తారు. పోస్టుమార్టం, ఇతర వైద్య పరీక్షలు పూర్తయ్యే సరికే ఆదివారం కార్యాలయ పని వేళలు ముగిశాయి. 

dubai government కోసం చిత్ర ఫలితం
పరీక్ష నివేదికలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే తుది నివేదిక జారీ చేస్తారు. సోమవారం ఉదయం వైద్య నివేదికలు అందిన తర్వాత మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. ఆ తర్వాతే పోలీసు క్లియరెన్స్‌ రావాలి. ఆ తర్వాత దుబాయిలోని ఇండియన్ కాన్సులేటు శ్రీదేవి పాస్‌ పోర్టును రద్దు చేసి మరణ సర్టిఫికెట్‌ను జారీ చేయాలి. అప్పుడు ఆమె మృతదేహన్ని భారత్‌కు తీసుకెళ్లడానికి ఎన్‌వోసీ జారీ అవుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: