సాధారణంగా సినిమాల్లో హీరోయిన్ల కెరీర్ తొందరగా ముగిసిపోతుంది. ఎక్కువలో ఎక్కువ పదేళ్లు ఉంటుంది. అక్క, వదిన పాత్రలో ఆ తర్వాత తల్లి పాత్రలో చేసుకోవాల్సి వస్తుంది. శ్రీదేవి మాత్రం సుదీర్ఘ కాలం హీరోయిన్‌గా ఉంది. 1970లో ప్రారంభమైన ఆమె సినీ ప్రస్థానం 1990 వరకు కొనసాగింది. 1994లో వచ్చిన ఎస్పీ పరుశురాం శ్రీదేవి చిట్టచివరి తెలుగు సినిమా.  బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రముఖ నిర్మాత బోని కపూర్ తో వివాహం జరిగింది. శ్రీదేవికి ఇద్దరు కూతుళ్లు జాహ్నవి, ఖుషి కపూర్ లు జన్మించిన తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది. 
Image result for శ్రీదేవి
పదమూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇంగ్లీష్-వింగ్లీష్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది.  ఫిబ్రవరి 24, 2018 న దుబాయ్ లో గుండెపోటుతో మరణించింది.  నటి శ్రీదేవీ మృతి కేసుపై చిలువలు పలువలుగా వెలువడుతున్న మీడియా కథనాలు తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. డెత్‌ సర్టిఫికేట్‌లో శ్రీదేవి ప్రమాదవశాత్తూ నీటమునిగి చనిపోయాన్న నిర్ధారణ మరిన్ని అనుమానాలు రెకెత్తిస్తోంది. ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షిగా అక్కడేఉన్న బోనీ కపూర్‌ను దుబాయ్‌ పోలీసులు గంటల తరబడి ఇంటరాగేషన్ చేస్తున్న విషయం తెలిసిందే.
Image result for sridevi dead body
తాజాగా ఈ వ్యవహారం పై స్పందించిన   బీజేపీ సీనియర్‌నేత, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్యణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవిది కచ్చితంగా హత్యేనని స్వామి ఆరోపించారు. ఆరోజు రాత్రి హోటల్ గదిలోకి ఎవరు వెళ్లారనేది బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.  వాస్తవానికి శ్రీదేవికి మద్యం తాగే అలవాటు లేదని..ఇండస్ట్రీల ఇప్పటి వరకు ఈ మాట వినలేదని..అలాంటిది ఆమె శరీరంలో ఆల్కహాల్ ఎలా ఉందని స్వామి ప్రశ్నించారు. హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు బయటకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
Image result for boney kapoor
శ్రీదేవి గుండెపోటుతో చనిపోయిందని మొదట ఎవరూ చెప్పారని ఆ తర్వాత వెంటనే మరో కోణం బయటకు రావడం పట్ల పలు అనుమానాలు ఉన్నాయని అన్నారు.  శ్రీదేవికి బలవంతంగా ఎవరైనా మద్యం తాగించరా? అన్నది తేల్చాలని సుబ్రమణ్య స్వామి డిమాండ్ చేశారు. శ్రీదేవిని హత్య చేశారనే అనుమానం తనకు కలుగుతోందంటూ  పెను సంచలనానికి తెర తీసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: